క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా షోస్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది రష్మి. హీరోయిన్ గా కూడా తనని తాను నిరూపించుకుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ తో సందడి చేస్తుంటుంది. రష్మీ గౌతమ్ అటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల విషయంలో ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఎలాంటి హాని కలిగించవద్దని కోరుతుంటుంది. అలాగే సమాజంలో జరిగే చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె ఓ దారుణ సంఘటన మీద పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయింది. రజస్వల అయిన 12 ఏళ్ల బాలిక అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి చంపేశారట. ఇది కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వలనే అని రష్మీ గౌతమ్ భావించింది. ఈ క్రమంలో తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. కనీసం ప్రాథమిక అవగాహన లేకపోవడం వలెనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ పోస్ట్‌పై పలువురు పలు రకాల అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
నిజానికి రష్మీ గౌతమ్ చెప్పిన మాట్లలు వందకు వందశాతం కరెక్ట్ అంటూ నెటిజన్స్ కూడా సమర్థిస్తున్నారు. రష్మీ ఎప్పుడూ సోషల్ కాజ్ కోసం తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది అంటూ ప్రశంసిస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలను కేవలం ఫ్యాన్స్ ని పెంచుకోవడానికి మాత్రమే కాకుండా.. సమాజహితం కోసం కృషి చేస్తుంటుందని మెచ్చుకుంటున్నారు. కచ్చితంగా అందరికీ మినిమం సెక్స్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వారి శరీరంలో వచ్చే మార్పుల గురించే కాదు.. ఆపోజిట్ సెక్స్ వాళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా తెలుసుకోవాలి.