Rashmi : దాన్ని నేనే లాగేసుకున్నా.. అనసూయపై యాంకర్ రష్మీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Rashmi: టీవీ షోల్లో జనాలను ఎక్కువగా ఆకట్టుకున్న షో ఏది అంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు జబర్దస్త్. కామెడీ స్కిట్స్ తో ఈ షో చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ కామెడీ షో కోసం జనాలు టీవీలకు అతుక్కు పోతారు. అంతలా ప్రేక్షకులను నచ్చింది జబర్దస్త్. ఈ కామెడి షో రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందాల భామ అనసూయ ఒక ఎపిసోడ్ కు మరో బ్యూటీ రష్మీ గౌతమ్ మరో షో కు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి యాంకర్ గా అనసూయ తప్పుకోవడంతో .. కొన్నాళ్లు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మినే హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత జబర్దస్త్ కు సౌమ్య రావు హోస్ట్ గా చేస్తుండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ హౌస్ట్ గా చేసింది.

ఇప్పుడు సిరి హనుమంతు వంటి వాళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అయితే ఈ అందరిలో రష్మీ, అనసూయ ఇద్దరికీ లభించిన క్రేజ్ ఆ షోలో మరెవరికీ రాలేదనే చెప్పాలి. అందరి కంటే ముందు అనసూయ జబర్దస్త్ లో కనిపించి కవ్వించింది. ఆ తర్వాత ఆమె గ్యాప్ తీసుకుందో లేక నిర్వాహకులే గ్యాప్ ఇచ్చారో తెలియదు. కానీ ఆ సమయంలో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో అనసూయని తప్పించి రష్మిని పెట్టారనే ప్రచారం జరగింది. అయితే ఈ అంశం మీద తాజాగా రష్మీ స్పందించింది.

- Advertisement -

రష్మీ మాట్లాడుతూ.. ‘అప్పట్లో నాకు సంబంధం లేని విషయం మీద నన్ను ట్రోల్ చేశారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయాను. నన్ను అప్పట్లో దారుణంగా తిట్టారంటూ ఆమె చెప్పుకొచ్చింది. రష్మీ నువ్వు అనసూయ ప్లేస్ ఎందుకు ఆక్రమించావు అని అడిగితే దానికి ఆమె ఆక్రమించుకోవడం ఏంటి లాగేసుకున్నానంటూ సమాధానం ఇచ్చింది. మరోసారి యాంకర్ అనసూయను పక్కకి పంపి నువ్వు.. ఎందుకు వచ్చావు అని అడిగితే అనసూయ చిన్నపిల్లా ఏంటి? పక్కకు పంపడానికి అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి రష్మి జబర్దస్త్ తో పాటు మల్లెమాల నిర్వహించే పలు షోలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. ఇక తాజాగా అనసూయ గురించి రష్మీ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here