నాని హాయ్ నాన్న మూవీ కి అరుదైన అవార్డు..!

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా లో సీన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మంచిగా ఈ సినిమాకి ప్రశంసలు కూడా దక్కాయి. దర్శకుడు
సౌర్యూవ్ ఈ సినిమాను తీసుకు వచ్చారు. బాలనటిగా కియారా ఖన్నా నటించి మెప్పించింది డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చి మంచి హిట్ అయింది. ఒక తండ్రి కూతురు మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగింది. అయితే తాజాగా ఈ సినిమాకి ఒక అవార్డు వచ్చినట్లు తెలుస్తోంది.

హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి అందరినీ బాగా ఆకట్టుకుంది. నిజానికి అందర్నీ ఒక్కసారి ఏడిపించేసింది ఈ సినిమా. ఈ మూవీ అంతర్జాతీయంగా హాయ్ డాడ్ అనే పేరుతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్ మార్చి 2024 ఎడిషన్ లో బెస్ట్ ఫీచర్ మూవీ గా ఈ సినిమాకి అవార్డు వచ్చింది. ఈ సినిమాకి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.

- Advertisement -

ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని తెలిపారు దర్శకుడు సౌర్యూవ్. సాంస్కృతిక సరిహద్దుల్ని అధికమించేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని ఈ మూవీకి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో నటుల నటన కానీ దర్శకుడు తీసుకున్న కథ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మార్కులు పడ్డాయి. అందరిని కూడా ఈ సినిమా భలే ఆకట్టుకుంది ఇప్పటికి కూడా ఈ సినిమాని చాలామంది మర్చిపోలేక పోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here