Ranjithame : తమిళ హీరో ఇళయదళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే. తుపాకి, పోలీసుడు వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ కు దగ్గరయ్యాడు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ వారసుడుగా థియేటర్లోకి వచ్చాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని రంజితమే.. రంజితమే చాలా ఫేమస్. రిలీజ్ అయిన గంటలోనే ఇది ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికీ ఈ పాట ట్రెండ్ అలాగే ఉంది.
రంజితమే పాట కొంతకాలంగా యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటపై సినిమా ప్రముఖులు, యూట్యూబర్ లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్య ప్రజలు, విజయ్ ఫ్యాన్స్ అందరూ డ్యాన్స్ చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా ముసలి వాళ్ల వరకు కూడా కాలు కదిపారు. అందరితోనూ ఈ సాంగ్ స్టెప్పులేయిస్తోంది. అయితే ఈ పాటకు సంబంధించి ఓ క్రేజీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. రంజితమే పాటకు పుట్టబోయే బిడ్డ కూడా గెంతులు వేస్తోంది.
ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే. రంజితమే పాట పెట్టినప్పుడు ఓ మహిళ కడుపులో ఉన్న బిడ్డ స్టెప్పులేస్తుంది. దీనికి సాక్షంగా తన తల్లి కడుపును పాట బీట్ విన్నప్పుడల్లా తంతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
విజయ్ – వంశీ పైడిపల్లి కాంబోలో వచ్చిన ‘వారిసు’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ అందుకుంది. ఇందులోని ‘రంజితమే’ పాట తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొంటూ తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ మహిళ బేబీ బంప్‌తో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ‘రంజితమే’ పాటను ప్లే చేయగా ఆమె కడుపులోని బిడ్డ గెంతులేస్తున్నట్లు కదలికలు కనిపిస్తున్నాయి. ‘‘రంజితమే పెట్టిన ప్రతిసారీ బేబీ ఇలాగే డ్యాన్స్ చేస్తోంది’’ అంటూ ఆమె మురిసిపోయింది. ఈ వీడియోపై చిత్ర సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ..‘‘ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నాను. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింది’’ అని పేర్కొన్నారు.
మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వారిసు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో విడుదలైంది. పండుగకు కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే కుటుంబకథా చిత్రమిదని పలువురు సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో శనివారం విడుదల చేశారు. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ రిలీజ్‌లను దృష్టిలో ఉంచుకుని.. తమిళనాడుతో పోలిస్తే మూడు రోజుల ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.