సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి ఒకవైపు జబర్దస్త్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చిన చిన్న పాత్రలను చేస్తూ రంగస్థలం, మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్ధస్త్ మహేష్ ( మహేష్ ఆచంట ). మహేష్ ఆచంట కాస్తా రంగస్థలం మహేష్ గా గుర్తింపు తెచ్చుకుని అందరు స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో ముందుకు పోతున్న రంగస్థలం మహేష్ ఇటీవలే వీరూపాక్ష సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఇక తాను ఎదుర్కొన్న కష్టాలను, చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
తనకు పేరు ఒక్క రోజులో వచ్చింది కాదని చెప్పారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. టాలెంట్ నమ్ముకొని వచ్చా. ఏం జరిగినా ముందుకెళ్లడమే నాకు తెలుసు. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. సమయంలో చేతిలో డబ్బు లేకపోవడంతో తండ్రి శవాన్ని కాల్చడానికి డబ్బు లేనపుడు ఇంకెందుకు జీవితం అనిపించింది. నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో ఈ బతుకు ఎందుకురా అనిపించింది.
నాన్న మరణించాక చాలా మంది నీ బతుక్కి సినిమాలు అవసరమా అని అన్నారు. డిగ్రీ అయిపోగానే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం మొదలు పెట్టిన మహేష్ కి మొదట్లో అవకాశాలు రాలేదు. అయితే అదే సమయంలో కోకా కోలా కంపెనీ లో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమాల్లో ప్రయత్నించినా ఉద్యోగం సరిగా చేయలేదని వెళ్ళిపోమనడంతో ఇక సినిమాల మీదే ఆధారపడ్డాడు మహేష్. అయితే సినిమా అవకాశాలు ఇంకా రాక ముందే తన తండ్రి మరణానికి వార్త రావడంతో ఒక్కసారిగా క్రుంగిపోయాడట. డైరెక్టర్ సుకుమార్ తనకు మంచి అవకాశం ఇచ్చారు. కొన్నేళ్లు పట్టినా కూడా మంచిపాత్ర చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు.