రీసెంట్ సమయం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద సక్సెస్ కాకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొని, ఓటీటీ లో విడుదలైనప్పుడు మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న చిత్రం ‘రంగమార్తాండ’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ మొట్టమొదటిసారి తన కెరీర్ లో పూర్తి స్థాయి ఎమోషనల్ క్యారక్టర్ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు.
ఈ సినిమాలో ఆయన నటన చూసి కనీళ్ళు పెట్టుకొని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాని రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చెయ్యగా , దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీఆర్ఫీ రేటింగ్స్ గొప్పగా వస్తాయని అందరూ అనుకున్నారు కానీ , మరీ ఈ రేంజ్ లో వస్తుందని మాత్రం అనుకోలేదు.
బార్క్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ సినిమాకి దాదాపుగా ఆరు టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. పెద్దగా పాపులారిటీ మరియు పబ్లిసిటీ లేని సినిమాకి ఈ స్థాయి రేటింగ్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు మొదటి టెలికాస్ట్ అప్పుడు సరైన రేటింగ్స్ రాక తడబడ్డాయి, వాటితో పోలిస్తే ‘రంగమార్తాండ’ కి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి ‘బలగం’ రేంజ్ గుర్తింపు లభించి ఉంటే కచ్చితంగా 10 కి పైగా రేటింగ్స్ వచ్చేవని అంటున్నారు.
ఇప్పుడు ఎలాగో ఒకసారి టెలికాస్ట్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది కాబట్టి, రిపీట్ టెలికాస్ట్ లో కచ్చితంగా ఇంకా ఎక్కువ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు . గతం లో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి, మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.