Rangabali : చేసిన ప్రయితీ సినిమా ఫ్లాప్ అవుతున్నప్పట్టికీ ఎంత ఆత్మా విశ్వాసం కోల్పోకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నాగ శౌర్య, ఈసారి కొడితే ఎలా అయినా హిట్టే కొట్టాలి అనే కసితో తీసిన కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ‘రంగబలి’, రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు ఈ చిత్రానికి చేసిన ప్రొమోషన్స్ ని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు.

ముఖ్యంగా కమెడియన్ సత్య , మంచి పాపులారిటీ ని సంపాదించిన కొంతమంది యాంకర్స్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఒక ఇంటర్వ్యూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.ఇది వరకు ఎవ్వరూ కూడా ఈ యాంగిల్ లో ప్రొమోషన్స్ చెయ్యొచ్చా అన్ని ఎవరూ ఊహించలేదు. అలాంటి యాంగిల్ ని ఆలోచించాడు అంటే, కచ్చితంగా డైరెక్టర్ లో విషయం ఉందని అందరూ అనుకున్నారు, కానీ పైన పటారం, లోన లొటారం అని పెద్దలు చెప్పిన సామెత ని గుర్తు చేసింది ఈ చిత్రం.

మొదటి ఆటనుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేక పోయింది. ఫస్ట్ హాఫ్ లో కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యింది అని టాక్ వచ్చినప్పటికీ ఎందుకో జనాలు ఈ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపలేదు.ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి, కెరీర్ లో దూసుకుపోదాం అనుకున్న నాగ శౌర్య కి నిరాశే ఎదురు అయ్యింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల 30 లక్షల రూపాయలకు జరగగా, ఇప్పటి వరకు ఈ చిత్రం 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కి ఇంకా మూడు కోట్ల రూపాయలకు పైగానే రాబట్టలోకి అన్నమాట, అది దాదాపుగా అసాధ్యం అనే ఆంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నాగ శౌర్య తన తదుపర్రి చిత్రాలతో అయినా బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.