Akkineni Nageswara Rao : మన టాలీవుడ్ లో లెజెండ్స్ కి సంబంధించిన బయోపిక్స్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సావిత్రి బియోపిక్ గా తెరకెక్కిన ‘మహానటి’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. ఆ తర్వాత ఎన్టీఆర్ బియోపిక్ ని తెరకెక్కించారు కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా అక్కినేని నాగేశ్వర రావు బయోపిక్ ని తెరకెక్కించే పనిలో పడినట్టు ఆయన కూతురు నాగసుశీల చెప్పుకొచ్చింది.
![akkineni nageshwara rao](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/akkineni-nageshwara-rao-jpg.webp)
నాకంటూ సినిమాలు చెయ్యాలని, నిర్మించాలని కోరిక లేదు కానీ, ఒకవేళ సినిమా తియ్యాల్సి వస్తే కచ్చితంగా నాన్న గారి బియోపిక్ ని నీంరిస్తాను అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది నాగసుశీల. అంతే కాకుండా అమ్మ బ్రతికి ఉన్న రోజుల్లో నాన్న గురించి చాలా విషయాలు మాతో చెప్తూ ఉండేది. పెళ్ళైన కొత్తలో నాన్నగారికి బాగా కోపం ఉండేదట, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్న మా మీద ఒక్కసారిగా కూడా కోపం తెచ్చుకోలేదు అంటూ నాగ సుశీల చెప్పుకొచ్చింది.
![akkineni susheela](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-654.png)
నాన్నగారు మాతో ఉన్నంతసేపు ఎంతో సరదాగా ఉండేవారని, ముఖ్యంగా మనవళ్లు, మానవరాళ్లతో ఆయన ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేవారు అంటూ చెప్పుకొచ్చింది సుశీల. ఇది ఇలా ఉండగా నాగేశ్వర రావు గారి బియోపిక్ లో హీరో గా నటించడానికి ఎవరు సరిపోతారు అని యాంకర్ నాగ సుశీల ని అడగగా, దానికి ఆమె సమాధానం ఇస్తూ ‘నాగార్జున చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ నాగార్జున కాకపోతే బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ చేస్తే బాగుంటుంది.
![ranbir kapoor nagarjuna](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-655-1024x576.png)
ఈ ప్రపంచం లో ఎవరి పాత్రలోకి అయినా పరకాయప్రవేశం చేసే సత్తా రణబీర్ కపూర్ కి ఉండు , నాగార్జున తర్వాత నాన్న గారి పాత్రకి అతను మాత్రమే న్యాయం చెయ్యగలడు’ అంటూ నాగ సుశీల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బియోపిక్స్ కి ప్రస్తుతం బాషా బేధం లేదు, కంటెంట్ అద్భుతంగా ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. కాబట్టి మన లెజెండ్ నాగేశ్వర రావు జీవిత చరిత్రని ప్రపంచం మొత్తం చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.