Ranbir Kapoor : బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల యానిమల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఆయనకు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో సీతగా ప్రశంసలు అందుకుంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. ఈ దంపతులిద్దరికి రాహా కపూర్ జన్మించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా కూతురు రాహా కపూర్‌కు రణ్‌బీర్ దేశంలోనే ఎవరూ ఇవ్వనటువంటి అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు సమాచారం.
ముంబై బాంద్రా నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్‌తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దాంతో ఏడాది వయసున్న రాహా కపూర్ బాలీవుడ్‌లో అత్యంత చిన్న వయుసులో కోటీశ్వరురాలైన స్టార్ కిడ్‌గా పేరుగాంచనున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త బంగ్లాకు రణ్ బీర్ అండ్ ఫ్యామిలీకి దాదాపుగా రూ.250 కోట్లు ఖర్చయిందని సమాచారం. అయితే, బంగ్లా ఖరీదుతో చూస్తే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాల కంటే ఎక్కువని తెలుస్తోంది. అంటే, బాలీవుడ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీల బంగ్లాను అధిగమించి ముంబైలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ భవనం ఇదేనట. రణ్ బీర్, అలియా ఇద్దరూ కలిసి కష్టపడి సంపాదించిన డబ్బును తమ డ్రీమ్ హౌస్ కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నారట.
భవన నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుందట. షారుఖ్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సాలతో పోలిస్తే ముంబై ప్రాంతంలో అత్యంత ఖరీదైన బంగ్లా ఇదే కానుంది. ఈ ఇంటికి తాను పిచ్చిగా ప్రేమించే తన కూతురు పేరే పెడతారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ఖరీదైన బంగ్లాతో పాటు, బాంద్రా ప్రాంతంలో అలియా, రణ్ బీర్ ఇద్దరికీ నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుందట.
అయితే, బంధువుల నుంచి వచ్చే బహుమతులకు భారతదేశంలో పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ బంగ్లాకు రాహా కపూర్ నానమ్మ నీతూ కపూర్ సహా యజమానిగా ఉంటారని సమాచారం. నీతూ కపూర్ భర్త, దివంగత నటుడు రిషి కపూర్ ఆమెను తన ఆస్తులన్నింటికీ సగం యజమానిగా చేశారని బాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక నీతూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు ప్రాంతంలో ఉంటున్నారు.