Netflix ఇటీవల కాలం లో విడుదలైన వెబ్ సిరీస్ లలో వివాదాలకు కేంద్ర బిందువు గా మారిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందా అంటే అది ‘రానా నాయుడు’ అనే చెప్పాలి.ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ మరియు దగ్గుపాటి రానా హీరోలు గా నటించారు.విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ నుండి అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ చెప్పించడం, ఆయన నోటి నుండి వినకూడని బూతులు వినాల్సి రావడం తో ఈ సిరీస్ ని జీర్ణించుకోలేకపోయారు మన తెలుగు ఆడియన్స్.

అంతే కాదు వెంకటేష్ తో కలిసి పని చేసిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ పై పెదవి విరిచారు.వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మూడు దశాబ్దాలుగా ఆయన ఫామిలీ ఆడియన్స్ లో వేసుకున్న బేస్ మెంట్ మరో హీరోకి అనితర సాధ్యమైనది.అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ చేత కూడా వెంకటేష్ ని బూతులు తిట్టించేలా చేసింది ఈ చిత్రం.

అయితే ఈ వెబ్ సిరీస్ యూత్ లో మాత్రం మంచి క్రేజ్ దక్కించుకుంది.అందువల్ల పెద్ద హిట్ అయ్యింది, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ వెబ్ సిరీస్ ని తెలుగు లో చూద్దాం అనుకున్న వాళ్లకి ఒక బ్యాడ్ న్యూస్.అదేమిటంటే ఈ వెబ్ సిరీస్ ఇక నుండి తెలుగు లో స్ట్రీమింగ్ అవ్వద్దు.నిన్నటి నుండి తెలుగు ఆడియో ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించేసింది.

కేవలం హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో మాత్రమే అందుబాటులోకి రానుంది.తెలుగు లో తొలగించడానికికి సరైన కారణం ఏమిటో ఇప్పటికీ తెలియదు కానీ, సోషల్ మీడియా వస్తున్న విపరీతమైన నెగటివిటీ ని దృష్టిలో పెట్టుకొనే తొలగించారని ఒక టాక్ నడుస్తుంది.ఇప్పటి వరకు ఇలాగే చాలా సినిమాలను నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించింది.మళ్ళీ అప్లోడ్ కూడా చేసింది, ఈ’రానా నాయుడు‘ సిరీస్ ని కూడా తెలుగు వెర్షన్ లో మళ్ళీ అప్లోడ్ చేస్తుందో లేదో చూడాలి.