నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది. అది అలా ఉంటే ఆమె బికినీ ధరించిన ఓ ఓల్డ్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రమ్యకృష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్‌లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు రంగమార్తండలోను కీలకపాత్రలో కనిపించింది.

గ్లామర్ చిత్రాల్లో నటిస్తూ మరో పక్కన కమర్షియల్ చిత్రాలు చేసిన రమ్యకృష్ణ పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. డివోషనల్ క్యారెక్టర్స్ చేశారు. చివరకు వేశ్యగా కూడా నటించారు. నరసింహ మూవీలో నీలాంబరి, బాహుబలి సిరీస్లో శివగామి పాత్రలు ఆమె కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఇలాంటి గొప్ప పాత్రలు ఆమె అనేకం చేశారు. కాగా రమ్యకృష్ణ బోల్డ్ రోల్స్ చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద స్కిన్ షోకి కూడా వెనుకాడలేదు. పాత్రలు డిమాండ్ చేస్తే ఆమె సాహసాలు చేసేందుకు వెనుకాడలేదు.

ఇక రమ్యకృష్ణ (Ramyakrishna) కి హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది మాత్రం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలతోనే. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో రమ్యకృష్ణ తన హాట్ హాట్ అందాలతో అప్పట్లో కుర్రకారును ఫిదా చేసింది.అయితే ఈ హీరోయిన్ ని గతంలో రాఘవేంద్రరావు బికినీ వేయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. రమ్యకృష్ణ ఒప్పుకోకపోవడంతో ఆమెను బతిమాలి బామాలి బుజ్జగిస్తూ ఎన్నో రకాల పనులు చేసి ఎట్టకేలకు ఆమెతో బికినీ వేయించడానికి ఒప్పించారట.