Ram Pothineni : ఇదెక్కడి ట్విస్ట్.. రామ్ పోతినేనితో అనుపమ పెళ్లిట. మొత్తం చెప్పేసిన అనుపమ తల్లి..

- Advertisement -

Ram Pothineni : వ్యక్తిగత జీవితాల మీద ప్రేక్షకులకు చాలా ఆసక్తి ఉంటుంది. వారికి సంబంధించిన సరికొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. స్కూల్ డేస్ ముచ్చట్లు, కాలేజీ డేస్ ప్రేమకథలు, ప్రేమలు, పెటాకులు, ఒకటేమిటీ అన్నింటిపైకా ఓ కన్నేసి ఉంచుతారు. హీరో, హీరోయిన్లు ఏ సినిమాలు చేస్తున్నారనే కాదు, ఎవరితో క్లోజ్‌గా ఉంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే విషయాల మీద ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటమే కాకుండా, వారి మీద లేనిపోని పుకార్లు పుట్టించి ఎంజాయ్ చేస్తుంటారు.

Ram Pothineni

తాజాగా టాలీవుడ్ లో అలాంటి రూమర్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. అందాల తార అనుపమ పరమేశ్వరన్, యంగ్ హీరో రామ్ పోతినేనితో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘ఉన్నది ఒకటే జిందగీ’. మరొకటి ‘హలో గురూ ప్రేమ కోసమే’. రెండో సినిమా చేసే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందట. అదికాస్త ప్రేమగా మారిందట. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఒకే చెప్పడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. ఇదీ తాజా గాసిప్ సారాంశం. ఈ వార్తలు గత కొద్ది కాలంగా వస్తున్నా, ఇటు అనుపమ గానీ, అటు రామ్ గానీ స్పందించలేదు.

ఎవరూ మాట్లాడకపోవడంతో గాసిప్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏదో తోస్తే అది రాసేస్తున్నారు. అయితే, ఈ రూమర్లు అనుపమ తల్లి సునీతకి తెగ చికాకు పుట్టిస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే అనుమప ప్రేమకథ గురించి స్పందించారట. రామ్ తో తమ అమ్మాయి ప్రేమలో లేదని తేల్చి చెప్పిందట. హీరోతో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేని కొట్టిపారేసిందట. వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా వార్తలు రాయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here