అడుగడుగునా బూతు బొమ్మలే.. వర్మ ఆఫీస్ గురించి బయటపడిన నిజాలు

- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన అందులో ఓ వెరైటీ ఉంటుంది. నలుగురికీ నచ్చింది నాకసలు నచ్చదులే అన్నట్లుగా ఉంటుంది ఆర్జీవీ తీరు. రియల్ లైఫ్ లో నిర్మొహమాటంగా ఉండటం, ముక్కుసూటిగా మాట్లాడుతూ పలు కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ అవుతుండటం మనోడి స్పెషల్ క్వాలిటీ. ఇదే క్రమంలో ఇప్పుడు తన మనసుకు నచ్చినట్లుగా హైదరాబాద్‌లో ఆర్జీవీ డెన్ ఏర్పాటు చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ

ఆర్జీవీ డెన్ పేరుతో హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు వర్మ. అత్యాధునిక వసతులు, చక్కటి అట్మాస్పియర్ తో ఈ భవనం నిర్మించారు. తాజాగా ఈ ఆఫీస్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేయడంతో.. ఆ వీడియో చూసి అంతా షాకవుతున్నారు. తన టేస్ట్ కి తగ్గట్లుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఆర్జీవీ డెన్ ఏర్పాటు చేసుకున్నారు. తన ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అడవులు, కొండలు, గుహలు, రాళ్లు రప్పల థీమ్ తో.. ఆయన క్రియేటివిటీ జోడించి ఈ ఆఫీస్ నిర్మించుకున్నారు. కాగా.. ఈ ఆఫీస్‌లో కింగ్ అక్కినేని నాగార్జున ఫొటోస్ పెట్టడాన్ని బట్టి చూస్తే ఆయనపై వర్మకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది.

ఆర్జీవీ అడల్ట్ ఫిల్మ్ జీఎస్టీకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. అలాగే అప్సర రాణి, లడ్కీ మూవీ పోస్టర్స్, పూజా బాలేకర్ సోయగాలు, మియా మాల్కోవా అశ్లీల చిత్రాలు దర్శనం ఇస్తాయి. అలాగే బట్టలు లేని బూతు బొమ్మలు సైతం ఓ ఫ్లోర్ అంతా అంటించారు. అత్యాధునిక వసుతులతో, అదిరిపోయే వాతావరణంతో ఆర్జీవీ డెన్ ఆకర్షణీయంగా ఉంది. ఇక రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ గోడలపై మోటివేటివ్ కొటేషన్స్ ఉన్నాయి. ‘బిలీవర్స్ విల్ బి ఫైర్ డ్’, ‘నీకు నా డ్యాన్స్ నచ్చలేదంటే.. నువ్వు నా మ్యూజిక్ వినలేదు’ అని ఎంట్రన్స్ లోనే దర్శనమిస్తాయి. ఆర్జీవీ కెరీర్ లోని అతిముఖ్యమైన విషయాలకు సంబంధించిన ఫొటోలను ఆఫీస్ లో అమర్చారు. బిగ్ బీ అమితాబ్, శ్రీదేవి, నాగార్జున, ఏఆర్ రెహమాన్, వెంకటేష్ క్షణం క్షణం సినిమా పోస్టర్ సహా పలువురు ప్రముఖులతో కలిసి ఉన్న ఫ్రేమ్స్ ఆకట్టుకున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here