మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు కలిసి ఇటీవల ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. క్లీంకార పుట్టిన తరువాత చరణ్-ఉపాసన ఇద్దరు కలిసి బయటకి వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? అన్నది ఒక ప్రశ్నగా మారింది. తాజాగా తన సోషల్ మీడియా పోస్టులతో ఉపాసన ఆ ప్రశ్నలకు బదులిచ్చేశారు.

ఉపాసన పోస్టులు బట్టి ఇద్దరు కలిసి పారిస్ వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక మరో పోస్టులో ఒక వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ని షేర్ చేశారు. ఈ పోస్టు బట్టి మ్యారేజ్ కి వెళ్లారని అర్ధమవుతుంది. అయితే అది ఎవరి పెళ్లి అనేది తెలియాల్సి ఉంది. కాగా త్వరలో మెగా కుటుంబంలో కూడా పెళ్లి సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఈ ఏడాది నవంబర్ లో జరగనుంది. ఆ పెళ్లి పనులు కూడా రామ్ చరణే చూసుకుంటున్నట్లు సమాచారం. వరుణ్-లావణ్య పెళ్లిని కూడా ఫారిన్ లోనే చేయనున్నారు.

ఈక్రమంలోనే పెళ్లి వేదిక పారిస్ అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ అక్కడికే వెళ్లడంతో.. ఆ పనులు కూడా ఏమన్నా మొదలు పెట్టారా..? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ లోనే ఉన్నాడు. ఆఫ్రికా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తప్ప.. ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. దీంతో అభిమానులంతా నిరాశ చెందుతున్నారు.