తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన పేరు గ్లోబల్ వైడ్‌గా మారు మోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడమే కాకుండా దీనిని ఆస్కార్ రేసులో నిలిపి అవార్డు కూడా అందుకున్నారు. అసలు రాజమౌళి ఫ్లాప్ అంటే ఏంటో కూడా ఇప్పటి వరకూ తెలియదు. ఇక ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్ట్రీ ఉంటుందంటారు. అలాగే రాజమౌళి సక్సెస్ వెనుక ఆయన భార్య రమ (Rama) ఉన్నారనడంలో సందేహంలో లేదు.

ఇక ఈయన చేసే ప్రతి సినిమాలో ఆయన ఫ్యామిలీ భాగం పంచుకుంటుంది. ఈ విషయం పక్కన పెడితే రాజమౌళి తన అన్న కీరవాణి భార్య సోదరి రమని పెళ్లి చేసుకున్నారు. అయితే రమకి రాజమౌళి (Rama Rajamouli ) తో పెళ్లి కంటే ముందే పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడు. ఇక ఈ విషయంలో చాలామంది రమా కి పెళ్లయ్యాక కూడా రాజమౌళి (Rajamouli) ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే డౌట్స్ వస్తాయి. అయితే రమా కి పెళ్లయ్యాక కొడుకు పుట్టాక భర్తతో విభేదాలు రావడంతో విడిపోయిందట. ఆయన ఒక పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడాట. ఇక శాంతి నివాసం అనే సీరియల్ చేసే టైంలో రాజమౌళికి రమా కి మధ్య పరిచయం పెరగడంతో అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

ఇక కీరవాణి కజిన్ అయిన రాజమౌళితో రమకి పరిచయం ఏర్పడటంతో అది ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. రాజమౌళిని రాఘవేంద్ర రావు గారి వద్ద పనిలో పెట్టింది రమ అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అలాగే కార్తికేయను.. రాజమౌళి సొంత కొడుకుగా చూసుకుంటూనే.. పిల్లలను కనడం ఇష్టం లేక.. ఓ పాపని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అలా టాలీవుడ్లో నిజమైన ఆదర్శ దంపతులుగా రాజమౌళి,రమ ల గురించి చెప్పుకోవచ్చు.