Ram Pothineni: ఏ హీరోహీరోయిన్లు అయినా కథకు తగ్గట్లు తమ మేకోవర్ చేసుకోవడం సర్వ సాధారణం. ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టు తమను తాము మలుచుకుంటారు. అందుకోసం బాడీ బిల్డింగ్, హెయిర్ స్టైల్, క్యాస్టూమ్స్ ఇలా అన్ని రకాల చేంజెస్ చేసుకోవాల్సిందే. పాత్ర డిమాండ్ చేస్తే అందుకోసం ఎంతకైనా కష్టపడే వాళ్ల జాబితా హీరో రామ్ కూడా ఒకరు. దేవదాస్ సినిమాతో లవర్ బాయ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమా సినిమాకు తనేంటో ఫ్రూవ్ చేసుకుంటున్నారు. క్యారెక్టర్ కోసం స్టైల్, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసే యంగ్ హీరోల్లో రామ్ ప్రత్యేకం. తను ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ఉన్నట్టు తన నెక్ట్స్ ప్రాజెక్టుల్లో లేరు.
ప్రస్తుతం తన తాజా చిత్రం ‘స్కంద’ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ‘స్కంద’ టీజర్ చూస్తే హీరో రామ్ భారీగా బరువు పెరిగినట్లు ఈజీగా అర్థం అవుతోంది. అయితే… రామ్ సినిమా కోసం ఎన్ని కిలోలు బరువు పెరిగారో తెలుసా?.. సాధారణంగా రామ్ అంతకుముందు 70 కిలోలకు కొంచెం అటు ఇటుగా ఉండేవారు. ‘స్కంద’ సినిమా స్టార్ట్ కావడానికి ముందు ఆయన బరువు 72 కిలోలు ఉన్నారు. ఈ సినిమా కోసం తాను 12 కిలోల బరువు పెరిగారు. ప్రస్తుతం ఆయన బరువు 84 కిలోలకు చేరుకున్నారు. సినిమాపై ఆయన చూపించిన కమిట్మెంట్ పట్ల చిత్రబృందం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘స్కంద‘ ట్రైలర్ చూస్తుంటే హీరో రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. వాటిలో ఒకటి ఫ్యామిలీ మ్యాన్ లుక్ అయితే… మరొకటి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆ రెండిటి మధ్య రామ్ చాలా వేరియేషన్స్ చూపించారు. ఒక్క పాత్రలో రెండు షేడ్స్ చూపిస్తున్నారా? లేదంటే సినిమాలో ఆయన రెండు క్యారెక్టర్లు చేస్తున్నారా? అనేది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. ఈ సినిమా గురువారం థియేటర్లలో సందడి చేయనుంది.