Ram Charan : సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ఉన్న స్టార్స్ పై రూమర్స్ రావడం కామన్.. ఆ రూమర్స్ తోనే బాగా ఫెమస్ అవుతున్నారు.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై ఒక రూమర్ వినిపిస్తుంది.. బాలివుడ్ హీరోయిన్ తోసీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు మ్యాటర్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

ఉమైర్ సంధు.. ఇటీవల కాలంలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు.. విడుదలకు ముందే సినిమాలకు రివ్యూ ఇస్తూ పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల ఇతడు రూటు మార్చాడు. నిత్యం వార్తల్లో నిలిచేందుకు సినీ తారల సీక్రెట్ ఎఫైర్స్ అంటూ సంచలన ట్వీట్ లు చేస్తున్నాడు. ఈయన ట్వీట్ లు అటు నార్త్ తో పాటు ఇటు సౌత్ లోనూ పెను దుమారం రేపుతుంటాయి.. ఎంతో మంది సెలబ్రిటీలు ఈయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఉమైర్ తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ ఫెమ్ హీరో గ్లోబర్ స్టార్ గా గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో రామ్ చరణ్ బెడ్ షేర్ చేసుకున్నాడంటూ ట్వీట్ చేసాడు.. అది ఇప్పుడు దుమారం రేపుతుంది..

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా 2012లో జంజీర్
అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. చరణ్ నటించిన తొలి బాలీవుడ్ ఫిల్మ్ ఇది. అపూర్వ లాఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తుఫాన్
పేరు తెలుగులో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రా తన అందాలతో రామ్ చరణ్‌ని లొంగ తీసుకుందని.. వీరిద్దరూ ముంబై హోటల్‌లో బెడ్ షేర్ చేసుకున్నారని ఉమైర్ ట్వీట్ చేశాడు. సీక్రెట్ ఎఫైర్ లీక్ అంటూ ఉమైర్ పేర్కొన్నాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.. ఇందులో నిజమేంత ఉందోగాని మెగా ఫ్యాన్స్ మాత్రం నోటికి పని పెట్టారు.. దాంతో ఈ ట్వీట్ చర్చనీయంసంగా మారింది.. ఇక దీనిపై ఉపాసన కూడా రియాక్ట్ అయ్యి, పబ్లిసిటీ కోసం ఇలాంటి వాటిని స్ప్రెడ్ చెయ్యకండి అంటూ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.. ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు..