Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన కొనిదెల ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎక్కువ వెకేషన్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్న ఈ కపుల్ మల్దీవ్స్ నుంచి మరిన్ని చిత్రాలను పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు.ఈ సందర్భంగా భార్య ఉపాసనను బాగా చూసుకుంటున్నారు. ప్రతిక్షణం ఆమెను సంతోషంగా చూసేందుకు చెర్రీ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టూర్లు, వెకేషన్ లకు జంటగా వెళుతున్న విషయం తీలిసిందే.రీసెంట్గా దుబాయ్ కి వెళ్లిన ఈ జంట అక్కడే శ్రీమంతం కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఓ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ గా మాల్దీవ్స్ ట్రిప్పును ఎంజాయ్ చేస్తున్నారు. వరుసగా టూర్లు, వెకేషన్లతో హాయిగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా మల్దీవ్స్ నుంచి రామ్ చరణ్ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
రామ్ చరణ్ పంచుకున్న ఫోటోలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చెర్రీ ఉపాసన కలిసి పారా గ్లైడ్ లో ఆకాశంలో విహరిస్తున్న పిక్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బ్యూటిఫుల్ ఫోటోలను నెటింట వైరల్ చేస్తున్నారు. మరోవైపు రాంచరణ్ క్యాజువల్ వెడ్స్ లో బ్యాక్ నుంచి ఇచ్చిన స్టైలిష్ స్టిల్ కు ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పటికే ఉపాసన డెలివరీ కి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. ఉపాసనా తన ఆరోగ్యం పై మరింతగా శ్రద్ధ తీసుకుంటుంది.మరికొద్ది రోజుల్లో రామ్ చరణ్ – ఉపాసన తండ్రి కాబోతుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చెర్రీ బర్తడే కి విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుంది త్వరలో రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న Rc16లో నటించనున్నారు.