Ram Charan : సినిమాలకు రామ్ చరణ్ దూరం…పుట్టబోయ్యే బిడ్డకోసం సంచలన నిర్ణయం

- Advertisement -

మెగా పవర్ స్టార్ Ram Charan గత కొన్నేళ్ల నుండి ఎంత బిజీ గా గడుపుతున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మూడేళ్ళ పాటు #RRR సినిమా కోసం డేట్స్ కేటాయించాడు.ఆ సినిమా పూర్తి అయిన వెంటనే శంకర్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు.మధ్యలో #RRR మూవీ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తో దానికోసం విదేశాల్లో పర్యటించాడు.ఆస్కార్ అవార్డ్స్ కోసం అయితే నెల రోజుల పాటు లాస్ ఏంజిల్స్ లో ఉన్న మీడియా చానెల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.

Ram Charan
Ram Charan

ఇలా క్షణ కాలం కూడా తీరిక లేకుండా గడిపిన ఆయన ఇండియా కి తిరిగి రాగానే శంకర్ మూవీ ‘గేమ్ చేంజర్’ షూటింగ్ లో పాల్గొన్నాడు.అలా ఎట్టకేలకు ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ ని చివరి దశకి తీసుకొచ్చాడు.ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్.ఈ షెడ్యూల్ తో మూవీ టాకీ పార్ట్ పూర్తి అవుతుందట.

Ram Charan Stops Shoots

దీనితో రామ్ చరణ్ ఒక మూడు నెలలపాటు ఎలాంటి షూటింగ్స్ లేకుండా ఇంట్లోనే ఉండేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన భార్య ఉపాసన ప్రస్తుతం ఆరు నెలలు నిండిన గర్భవతి, 7 వ నేలలోకి అడుగుపెట్టింది. ఈ చివరి మూడు నెలలు ఆమె వద్దే ఉంటూ ఆమెకి కావాల్సిన అవసరాలన్నీ చూసుకునేందుకు రామ్ చరణ్ షూటింగ్స్ కి విరామం ఇస్తున్నట్టు తెలుస్తుంది. డెలివరీ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ బుచ్చి బాబు తెరకెక్కించబోయ్యే రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించబోతున్నాడు.

- Advertisement -
Ram Charan Upasana

ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక పాత్రకి కాళ్ళు ఉండవట, మరో పాత్ర కబ్బడి టీం కి కెప్టెన్ అట. కెరీర్ లో మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నానని, ఈ చిత్రం రంగస్థలం ని మించే ఉంటుందని కొద్దిరోజుల క్రితమే ఇండియా టుడే ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఈ పాత్ర ఆయనకి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here