తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఆయన సినిమా అంటే ఒక పండగ. మనం చిన్నతనం లో ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి అభిమానే. 70 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా ఇప్పటికీ ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ పెడుతున్నాడు అంటే, మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి మెగాస్టార్ కి కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చి, నేడు పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగి తండ్రిని మించిన తనయుడిగా నిలిచాడు రామ్ చరణ్. కేవలం హీరో గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి తన తండ్రితో క్రేజీ ప్రాజెక్ట్స్ తీసాడు. అయితే ఖైదీ నెంబర్ 150 చిత్రం మూవీ ప్రొమోషన్స్ అప్పుడు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ముందుగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ మీకు జ్వరం వస్తే రామ్ చరణ్ తల్లడిల్లిపోవడం నేను చూసాను సార్ అని అంటాడు. అప్పుడు చిరంజీవి వాడి బాధ మొత్తం నా మీద ప్రేమ కాదు, సినిమా కి ఎక్కడ నష్టం వస్తుందో అని. ఏదైనా తేడా అయ్యి డబ్బులు నష్టపోతే మళ్ళీ నా మీదకే గొడవలకు వస్తాడు కదా అని నవ్వుతూ అంటాడు. అప్పుడు వీవీ వినాయక్ లేదు సార్ మీరంటే నిజంగానే ప్రేమ అని బదులిస్తాడు. ఇదంతా సరదాగా జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ మాత్రమే.
చిరంజీవి ఎన్నో సందర్భాలలో నా జీవితం లో నేను సాధించినది ఏదైనా ఉంది, అది గర్వంగా చెప్పుకోవాల్సింది అంటే రామ్ చరణ్ ని కన్నందుకు గర్వ పడుతున్నాను. ఎక్కడైనా కొడుకు కెరీర్ ని చక్క దిద్దే ప్రయత్నం చేస్తాడు తండ్రి, కానీ ఇక్కడ నా బిడ్డ మాత్రం నా కోసమే ఆలోచిస్తాడు, ఇంతకు మించి ఏమి కావాలని అని అనేక ఈవెంట్స్ లో చెప్పుకొచ్చాడు.