రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన పండింటి ఆడబిడ్డకు జన్మనించిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు ఈ శుభవార్త ని ఏ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారో మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో పాప నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పూజలు నిర్వహించారు.

ఇక మెగా కుటుంబం లో ఒక్కొక్కరు ఎంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాప పుట్టినరోజు నాడు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి తన ఆనందం ని వ్యక్త పరిచాడు. ఇక రామ్ చరణ్ కూడా కాసేపటి క్రితమే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి అందరికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కాబట్టి, ఉపాసన డెలివరీ విషయం మేము మొదటి నుండి నిశ్చింతగానే ఉన్నాము. కానీ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహించారు. వాళ్లకి ఏమిచ్చి నా ఋణం తీర్చుకోగలను వాళ్ళు చూపించే అభిమానంకి. పాప కోసం దీవించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఇక విలేఖరి పాపకి ఏమి పేరు పెట్టబోతున్నారు అని అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘ఈ సంప్రదాయాలు నాకు తెలియవు, బిడ్డ పుట్టిన 13 వ రోజు పేరు పెడతారట, నేను ఉపాసన ఒక పేరు అనుకున్నాము, కొన్ని రోజులు ఆగండి, నేనే మీ అందరికీ తెలియచేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. చివర్లో పాప ఎవరి పోలికలు అని అడగగా, కచ్చితంగా వాళ్ళ నాన్న పోలికలతోనే పుట్టింది అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.
Love You Annayya @AlwaysRamCharan 🥹❤️
— Trends RamCharan™ (@TweetRamCharan) June 23, 2023
“కచ్చితంగా నాన్న లాగే ఉంది” 😂😂 pic.twitter.com/Pq8HRTQ6ab