Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్నతనం నుండి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగ మితభాషి, పెద్దగా ఎవరితో కలవడు, అల్లరి చెయ్యడు అని ఆయన ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగానే మితభాషి అని చెప్పిన సందర్భం ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రామ్ చరణ్ చిన్నతనం లో చేసిన అల్లరి గురించి చెప్తూ, ఫారిన్ కి తీసుకెళ్లినప్పుడు రామ్ చరణ్ ఆయన్ని ఎంత టార్చర్ పెట్టాడో కూడా ఒక పాపులర్ టాక్ షో లో చెప్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చిన్నప్పటి నుండి రామ్ చరణ్ తో కలిసి పెరిగిన అల్లు శిరీష్ కూడా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ మీరంతా చూసినంత మంచోడు అసలు కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్ పైకి కనిపించడు కానీ, మా ఇంట్లో అందరికంటే ఎక్కువ అల్లరి చేసేది ఆయనే. ఆయన చెయ్యాల్సింది మొత్తం చేసేసి సైలెంట్ గా నిల్చుంటాడు. మేము తిట్లు తినేవాళ్ళం. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం చాలా అమాయకుడు, ఏదైనా తప్పు చేస్తే భయపడిపోతాడు, అది ఇంట్లో వాళ్లకి తెలిసే లోపే వాడే చెప్పేస్తాడు. ‘నిన్ను అసలు ఎవరి కనిపెట్టారు?, ఎందుకు ఒప్పుకున్నావ్ రా నువ్వే తప్పు చేసావ్ అని’ అంటూ వాడిని సరదాగా ఆట పట్టించేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్.
ఇక ఆయన కెరీర్ విషయానికి వస్తే 2022 వ సంవత్సరం లో ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘బడ్డీ’ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు కానీ, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.