Ram Charan : చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సూపర్ హీరో మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఏకంగా హిందీలో 19 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్‌సీస్‌లో హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది.

మూడు మిలియన్ల మార్క్‌ను దాటింది. తెలుగులోను దుమ్ముదులుపుతోంది. మొత్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంక్రాంతి సినిమాల్లో గుంటూరు కారం తర్వాత వంద కోట్ల మైలురాయిని అందుకున్న సెకండ్ మూవీగా హనుమాన్ నిలిచింది. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన హనుమాన్ సినిమాకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ అంటూ క్లైమాక్స్‌లో రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ. అలాగే, హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటి? అంటూ అంచనాలను పెంచేశాడు. అప్పటి నుంచి హనుమాన్ 2లో స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం జై హనుమాన్‌లో శ్రీరాముని పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడు అంటూ ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది.