అప్పట్లో రామ్ చరణ్ ఓ బాలీవుడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ గ్రేటెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే జంజీర్ చిత్రాన్ని అదే పేరుతో రామ్ చరణ్ హీరోగా, అపూర్వ లఖియా దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక. తెలుగులో ఈ సినిమా తూఫాన్ పేరిట వచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో దర్శకుడు అపూర్వ లఖియాను రామ్ చరణ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆ డైరెక్టర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కు ఫోన్లు తీసే అలవాటు లేదని చెప్పారు.
ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో ప్లాప్‌గా నిలిచింది. అయితే దీని తర్వాత చరణ్ ఈ దర్శకుడిని దూరం పెట్టాడని ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అపూర్వ లఖియా ఈ విషయం గురించి మాట్లాడాడు.. ‘‘రామ్ చరణ్, నేను మంచి స్నేహితులం. ‘జంజీర్’ తర్వాత కూడా నేను ఎన్నో సార్లు వాళ్లింటికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. అతడు ఇప్పుడు నా ఫోన్ తీయడం లేదు. ఎందుకంటే తను సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.. పైగా అతడికి ఎక్కువగా ఫోన్లకు ఆన్సర్ చేసే అలవాటు లేదు. అందుకే ఉపాసన (Upasana) నా ఫోన్‌కు ఆన్సర్ చేస్తుంది. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) షూటింగ్ సమయంలో కూడా మేము మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చరణ్ నాకు ఫోన్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల గురించి చర్చించుకున్నాం. హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు నన్ను కలుస్తాడు’’ అని చెప్పాడు. ఇక ‘జంజీర్’తో రామ్ చరణ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా నటించింది. 2013లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.