Ram Charan : ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబర్ స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో చరణ్ ప్రాజెక్ట్స్, సినిమాలపై ప్రేక్షకుల్లో అంచానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ మరో కొద్ది రోజుల్లో పూర్తి కాబోతోంది. ఆ తర్వాత చెర్రి ఉప్పెన ఫేం బుచ్చిబాబు సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో చరణ్‌కి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కుర్లు కొడుతుంది. చరణ్ తన తదుపరి సినిమాను బాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్‌తో సైన్ చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ బజ్ చూసి మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ మధ్య చరణ్ తరచూ ముంబైకి వెళుతున్న సంగతి తెలిసిందే. దీంతో అసలు చెర్రీ ముంబై వెళ్లడానికి కాణమేంటని ఆరా తీయగా ఈ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఓ పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడట చరణ్. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇటీవల చరణ్ స్క్రిప్ట్ కూడా విన్నాడంటూ ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగులు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే చరణ్ ఈ మధ్య తరచూ ముంబైకి చక్కర్లు కొడుతున్నాడట. చారిత్రాత్మక చిత్రాలకు సంజయ్ లీలా భన్సాలీ కేరాఫ్ అడ్రస్. నాటి షారుక్ దేవదాసు నుంచి రామ్ లీలా, పద్మావత్ వంటి హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలో ఆయన హిస్టారికల్ సినిమాటిక్ వరల్డ్‌లో ఇంకో డ్రిమ్ ప్రాజెక్ట్ ఉందట. అదే పదకొండో శతాబ్దానికి చెందిన సుహల్ దేవ్ అనే పోరాట యోధుడి కథ. ఈ సినిమా తెరకెక్కించేందుకు భన్సాలీ ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్నారట.

దానికి తగ్గ నటుడు కోసం ఆయన వెతుకుతుండగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామరాజు రూపంలో చరణ్ ఆయనకు కనిపించాడట. దీంతో ఈసినిమాను చెర్రితోనే తియాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ఆయన సినీవర్గాల నుంచి సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి ఇంతకుమించిన పండగలాంటి వార్త ఏముంటుంది. ఇటీవల చరణ్ భార్య, కూతురితో కలిసి ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. చరణ్ అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కడం చూస్తుంటే ఇదే నిజమే అయ్యింటుందని ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు.