Ram Charan Fans : RRR చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు ఇప్పటి వరకు ఏ ఇండియన్ స్టార్ హీరోకి కూడా రాలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. గూగుల్ సెర్చ్ లో మనోడిని ప్రపంచం మొత్తం వెతికింది, ఎవరూ ఈ క్రేజీ స్టార్, ఇతని గురించి తెలుసుకోవాలి అనే ఆత్రుతతో కోట్లమంది సినీ ప్రేక్షకులు ఆయన కోసం గూగుల్ లో వెతకడం మొదలెట్టారు.

.అందుకే ఆయనని రియల్ గ్లోబల్ స్టార్ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు.ఇక ఇండియా కి తిరిగిరాగానే ‘ఇండియా టుడే’ ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించే ‘కాంక్లేవ్’ మీటింగ్ లో రామ్ చరణ్ ని పాల్గొనాల్సిందిగా ఆహ్వానం దక్కగా, నిన్న సాయంత్రం ఆయన ఆ మీటింగ్ లో పాల్గొన్నాడు.దానికి ముందుగా ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కలిసాడు.

అయితే రామ్ చరణ్ తో పాటుగా చిరంజీవి కూడా రావడమే ఇప్పుడు చరణ్ మరియు మెగా ఫ్యాన్స్ లో అసహనం ఏర్పడింది.చరణ్ ని స్వయంగా అమిత్ షా పిలిచి షాల్వా కప్పి ‘ఆస్కార్’ అవార్డు గెలిచినందుకు అభినందనలు తెలపడం అనేది చాలా గొప్ప విషయం, కానీ ఆయనతో పాటుగా చిరంజీవి రావడం వల్ల క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్ళిపోయింది.

చిరంజీవే అమిత్ షా తో రామ్ చరణ్ ని కలిసే మీటింగ్ ఏర్పాటు చేసాడని, ఇందులో రామ్ చరణ్ గొప్పదనం ఏమి లేదంటూ దురాభిమానులు సోషల్ మీడియా లో ఒక ప్రచారం చెయ్యడం మొదలెట్టారు. దీనితో అసహనం కి గురైన మెగా ఫ్యాన్స్ చిరంజీవి పై విరుచుకుపడుతూ ‘ఇక్కడికి కూడా నువ్వు కూడా రావాలా బాసూ, మన చరణ్ బాబు కి మాత్రమే దక్కాల్సిన గౌరవాలను నువ్వు దక్కించడం లేదు, ఇకనైనా చరణ్ ని కెరీర్ పరంగా ఒంటరిగా వదిలేయి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.