Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల తేదీ ప్రకటనపై మండిపడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..నేషనల్ వైడ్ ట్రెండింగ్!

- Advertisement -

Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం లో #RRR మేకర్స్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Pawan Kalyan OG
Pawan Kalyan OG

అసలు సిసలు పవర్ స్టార్ సినిమా అంటే ఇదే కదా అని అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటూ 70 శాతం కి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ గా ఉండడం వల్ల తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ఖరారు చేసారు నిర్మాతలు. గతం లో సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అదే రోజున ‘ఓజీ’ చిత్రం కూడా విడుదల కాబోతుండడం తో హిస్టరీ రిపీట్ అవ్వుద్ది అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

మరోపక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. మా ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ఇదే తేదీలో విడుదల చేస్తామని మొన్ననే అనుకున్నారు, కానీ అధికారిక ప్రకటన చెయ్యకపోవడం వల్ల ఆ డేట్ లోకి ఓజీ వచ్చేసింది. ఇది కచ్చితంగా శంకర్, దిల్ రాజు తప్పిదమే, నిద్ర లెయ్యండి ఇకనైనా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ నిన్న పెద్ద ఎత్తున శంకర్, దిల్ రాజు ని ట్యాగ్ చేసి నేషనల్ వైడ్ గా నెగటివ్ ట్రెండ్ చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here