Natu Natu Song : రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే పేరు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. తన సినిమాలు విడుదల కాకపోయినా ఈ మెగా హీరో మాత్రం చర్చనీయాంశం అవుతాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ-రాదికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు టాలీవుడ్ నుండి చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందడంతో రామ్ చరణ్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, తమిళ హీరో సూర్య, హిందీ నటుడు బొమన్ ఇరానీతో కలిసి నాటునాటు పాటకు స్టెప్పులు వేశారు. ముంబైలో జరిగిన ఐఎస్‌పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) ప్రారంభ వేడుకల్లో రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సూర్య, బొమన్ ఇరానీలతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. వారితో కలిసి స్టెప్పులు వేశాడు. కాగా, దేశంలోని యువ క్రికెట్ ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు.
ఈ లీగ్ లో తొలి మ్యాచ్ గా క్రికెటర్లు, సినీ హీరోల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో సచిన్ కోర్ కమిటీ సభ్యుడు. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. వీరిలో మాఝీ ముంబై తరఫున అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ కె వీర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు స్ట్రైకర్స్ తరఫున హృతిక్ రోషన్, చెన్నై సింగమ్స్ జట్టుకు సూర్య, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా జట్టుకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ హాజరయ్యారు. ముంబైలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మార్చి 6 నుంచి 15 వరకు జరగనుంది. యువ ఆటగాళ్లను ఎంపిక చేసి టెన్నిస్ బాల్‌తో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో రాణించిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ ముఖ్య ఉద్దేశం. అయితే.. ఈ లీగ్ ప్రారంభంలోనే క్రికెట్ స్టార్లు, హీరోలతో నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి.. రామ్ చరణ్ రేంజ్ ఇదేనంటూ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తుంటే. మరికొందరైతే ఆపండ్రా బాబు ఈ నాటు సాంగ్ ఎక్కడైనా వినాలంటేనే చిరాగ్గా ఉంది. దానికి తోడు ఏ స్టేజ్ మీద చూసిన ఇదే నా చాలు.. ఇక అంటూ కామెంట్లు చేస్తున్నారు.