Rakul Preet : స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్రహీరోల అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. కెరీర్ కాస్త నిమ్మదించగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్ గా ఉంటూ పెళ్లి తర్వాత తన భర్తతో వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రకుల్ భర్త జాకీ చిక్కల్లో పడినట్లు వార్తలు వస్తు్న్నాయి. తమకు జీతం ఇవ్వకుండా బాధపెడుతున్నారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

వివరాల్లోకి వెళితే.. రకుల్ భర్త జాకీ భగ్నానీకి బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ఓ నిర్మాణ సంస్థ ఉంది. దీని ద్వారా పలు సినిమాలు తెరకెక్కిస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు ఆయన. అయితే ఇటీవల బడే మియా చోటే మియా మూవీ ఆయన బ్యానర్ మీద నుంచే వచ్చింది. కానీ అది డిజాస్టర్ కావడంతో నష్టాల్లో కూరుపోయినట్లు తెలుస్తోంది. దీంతో రెండు నెలల జీతం బకాయి ఉన్నారని రెండేళ్లుగా ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని పూజా నిర్మాణ సంస్థపై ఉద్యోగులు పోస్టులు పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అయితే బాలీవుడ్ రూల్స్ ప్రకారం 45 నుంచి 60 రోజుల్లో డబ్బులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు తమకు జీతాలు ఇవ్వలేదని వైష్ణవి అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నాతో పాటు 100 మందికి జీతాలు ఇవ్వడం లేదు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది.
ఇందులో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్స్ వెంటనే ఇచ్చారు. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని సినిమా కోసం పని చేశాం. ఇంత కాలం భరించాం. కానీ కష్టపడిన సొమ్ము కోసం వారు చేసినవన్నీ బయట పెట్టక తప్పడం లేదు. తిండి కూడా సరిగ్గా పెట్టరు. మా ప్రశ్నలకు ప్రొడ్యూసర్ దగ్గర సమాధానాలు కూడా లేవు. ఈ సంస్థలో పని చేయకండి. దయచేసి మీడియా ప్రతినిధులు మా సమస్యలను కవర్ చేయాలని ప్రార్థిస్తున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఈ విషయాలను షేర్ చేయండి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. జాకీ భగ్నానీ కోట్లు సంపాదిస్తూ.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బాధ పెట్టడం ఏంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.