Rakul Preet Singh : సినిమా అవకాశాలు లేకపోవడంతో కొత్త వ్యాపారం ని మొదలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్!

- Advertisement -

Rakul Preet Singh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలం లోనే యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని అనతి కాలంలోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో తప్ప దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్, తమిళం లో కూడా దాదాపుగా అందరి హీరోలతో కలిసి నటించింది.

రీసెంట్ గా ఈమె కమల్ హాసన్ హీరో గా నటించిన ‘ఇండియన్ 2 ‘ లో కూడా ఒక హీరోయిన్ గా చేసింది. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చేతిలో అడపాదడపా సినిమాలు ఉన్నప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పుడు లేదనే చెప్పాలి. సినిమాల్లో అవకాశాలు రావడం బాగా తగ్గిపోయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఇండియన్ 2 చిత్రం తప్ప మరొకటి లేదు. ఆ సినిమాలో కూడా ఈమెకి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫ్రీ అయ్యింది కాబట్టే, ఆమె తన ప్రియుడు జాకీ భగ్నానీ ని పెళ్లి చేసుకోబోతుంది. ఈ నెల 21 వ తారీఖున వీళ్లిద్దరు గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత నటనకి పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఆమె తన కాబొయ్యే భర్త జాకీ భగ్నానీ తో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉందట. దీనికి సంబందించిన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది అట. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ని అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క హీరోయిన్ కూడా నిర్మాతగా సక్సెస్ అవ్వలేదు, మరి రకుల్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here