Rakul Preet Singh .. ఈ పంజాబీ బ్యూటీ మరోసారి తన స్టన్నింగ్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈసారి ట్రెండీ కమ్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. గ్లిట్టర్ శారీలో మెరిసిపోయింది రకుల్. మెరిసిపోతున్న చీరలో మెస్మరైజింగ్ లుక్స్ తో అదుర్స్ అనిపించేలా పోజులిచ్చింది. కాస్త క్లీవేజ్ షో.. మరికాస్త నడుం ఎక్స్ పోజ్ చేస్తూ రకుల్ మాయ చేసింది. ప్రస్తుతం రకుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రకుల్ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఈ బ్యూటీ మాయలో పడిపోతున్నారు. చీరకట్టులోనూ ట్రెండీగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. గ్లిట్టర్ శారీలో రకుల్ మెరుపులు మెస్మరైజింగ్ గా ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. నాని చమ్కీలా అంగిలేసి చాకులా ఉంటే.. రకుల్ చమ్కాయించే చీరలో కత్తిలా ఉందంటూ కుర్రాళ్లు పాటలు పాడుకుంటున్నారు. శారీలోనూ రకుల్ చాలా హాట్ గా ఉందంటూ ఫైర్ ఎమోజీ షేర్ చేస్తున్నారు. వీ లవ్ యూ రకుల్ అంటూ తమ ప్రేమతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. త్వరగా టాలీవుడ్ కి వచ్చేయ్ అంటూ తెగ రిక్వెస్టులు పెట్టేస్తున్నారు.

ఇక రకుల్ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ కెరటం సినిమాతో సినీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో టాలీవుడ్ లోకి దూసుకొచ్చి ఆ తర్వాత వరుస విజయాలతో అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ ఆడిపాడింది. ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక్కడ గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్.. అక్కడ మాత్రం మంచి మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముంబయి ప్రేక్షకులను మాయ చేస్తోంది.

రకుల్ బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని అతడి బర్త్ డే రోజున సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్. ఆల్ ది బెస్ట్ రకుల్.