Rakul Preet Singh సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెడ్ కలర్ ఔట్ఫిట్లో హాట్ మిర్చిలా కనిపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఓ అవార్డ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన రకుల్ ట్రెండీ లుక్స్‌లో మతిపోగొడుతోంది. రోజురోజుకు మరింత అందంగా తయారవుతూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా రకుల్ రెడ్ కలర్ స్లిట్ డ్రెస్సులో థైస్ షో చేస్తూ కుర్రాళ్లను కవ్వించింది. టాప్‌లో జిగ్‌జాగ్ ప్యాటెర్న్‌లో ఎద అందాలు చూపించీ చుపించనట్టు దోబూచులాడింది. ప్రస్తుతం రకుల్ కూల్ లుక్స్‌లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా రకుల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఔట్ఫిట్లో రకుల్ శిమ్లా మిర్చీలా కనిపిస్తోందని అంటున్నారు. రెడ్‌లో సూపర్ హాట్‌గా ఉన్నావ్ రకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్‌కు వెళ్లాక బాగా బక్క చిక్కావ్ అని ఇంకొందరు తెగ బెంగ పెట్టేసుకుంటున్నారు. హాట్, ఫైర్ ఎమోజీస్‌తో నెటిజన్లు తమ ప్రేమను కురిపించేస్తున్నారు. రకుల్ త్వరగా టాలీవుడ్‌కు వచ్చేసేయ్ అంటూ రిక్వెస్టుల మీద రిక్వెస్టులు చేస్తున్నారు.

ఇక రకుల్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. బీ టౌన్లో వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. రన్ వే, అటాక్, డాక్టర్ జీ, ఛత్రివాలీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సౌత్‌లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన రకుల్.. బీ టౌన్లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరిస్తోంది. అక్కడి ప్రేక్షకులు కూడా రకుల్‌ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక నిర్మాతలు కూడా రకుల్‌కు వరుస అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.

రకుల్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ బ్యూటీ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. ఈ జంట తరచూ చెట్టా పట్టా లేసుకుంటూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. ఇక టైం దొరికితే చాలు వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమ రిలేషన్షిప్ విషయాలను పబ్లిక్‌తో షేర్ చేసుకోరు. కానీ రకుల్, జాకీ.. తమ ప్రేమ విషయాన్ని అందరికీ చెప్పేసి.. హాయిగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీ టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.