Rakul Preet Singh : ఒక్కరి పోస్టు వల్ల సినిమాకు బ్యాడ్​నేమ్ అంటూ రకుల్​​ ​ఫైర్​

- Advertisement -

Rakul Preet Singh.. కెరటం సినిమా ద్వారా టాలీవుడ్​కు పరిచయమైన పంజాబీ భామ. ఆ తర్వాత సందీప్ కిషన్​తో నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ మూవీలో.. ప్రార్థనా.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాగార్జున వంటి సీనియర్ హీరోలతో.. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్లతో నటించింది.

Rakul Preet Singh
Rakul preet singh

టాలీవుడ్​లో సూపర్ స్పీడ్​గా దూసుకెళ్తున్న ఈ భామకు సడెన్​గా బాలీవుడ్ అవకాశం తలుపుతట్టింది. అంతే ఒక్క సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్​లోనే మకాం వేసింది. ప్రస్తుతం అక్కడే సెటిల్​ అయి.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ కలెక్షన్స్.. సినిమా హిట్, ఫెయిల్యూర్.. ఇలా వేటితో సంబంధం లేకుండా బీ టౌన్​లో రకుల్​కు వరుస అవకాశాలు వస్తున్నాయి.

Chhatriwali

ఇప్పటికే అయ్యారీ, దేదే ప్యార్ దే, రన్ వే 34, థాంక్ గాడ్, డాక్టర్ జీ, ఛత్రివాలీ సినిమాలతో బీ టౌన్​లో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక్క బాలీవుడ్​లోనే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ఈ పంజాబీ భామ ప్రేమలో పడింది. ఈ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని.. స్వయంగా వారే సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఆ తర్వాత చాలాసార్లు ఇద్దరూ కలిసి ఫంక్షన్స్​కి, ఈవెంట్స్​కి, వెకేషన్లకు వెళ్లడం స్టార్ట్ చేశారు.

- Advertisement -

ప్రస్తుతం రకుల్ తన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ఛత్రీవాలీ సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా రకుల్ ఓ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో రకుల్ పాన్ ఇండియా సినిమాల గురించి, బాయ్​కాట్ బాలీవుడ్ వివాదాలు గురించి మాట్లాడింది.

‘ఎంతోమంది నటులు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ పనిచేశారు. మీరూ కూడా. కొత్తగా పాన్‌ ఇండియా ట్యాగ్‌లైన్‌ తెరపైకి వచ్చింది’ అంటూ యాంకర్‌.. రకుల్‌ అభిప్రాయాన్ని కోరగా ఆమె ఇలా స్పందించింది.

‘‘ఒక్కటే ఇండియా. ఇండియా అంటే ఇండియానే. కొవిడ్‌ తర్వాత ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న కథా చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొరియన్‌ వెబ్‌సిరీస్‌లనూ చూస్తున్నారు. అలాగే పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం.. ఇలా మన రీజినల్‌ సినిమాలు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అలరిస్తున్నాయి. పాన్‌ ఇండియా అనే పదం ఉంటే పెద్ద సినిమా అని భావిస్తున్నారు. ఆ ట్యాగ్‌ ఉంటే తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తారు. అదొక కమర్షియల్‌ కోణం అని అనుకుంటున్నా. సినిమాలకు భాష కంటే ఎమోషన్‌ ముఖ్యం అనేది నా అభిప్రాయం. ఓ నటిగా ఏ భాషలోనైనా మంచి కథలు ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా’’ అని రకుల్‌ చెప్పుకొచ్చింది.

‘బాలీవుడ్‌ సినిమాలు విజయం సాధించలేకపోతున్నయి’ అనే విషయంపై స్పందించిన రకుల్‌.. ‘‘ఏదో చిన్న తప్పు చేస్తే ఫలానా నటుడు, ఫలానా నటి చెడ్డవారని, బాలీవుడ్‌ చిత్రాలు విజయం అందుకోలేకపోతున్నాయని ఎవరో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెడతారు. అది తీవ్ర చర్చకు దారి తీస్తుంది. బాగోలేని సినిమాను ప్రశంసించమని నేను చెప్పను. కానీ, ఏదైనా చిత్రం సరిగా ఆడకపోతే దానికి కారణాలు చాలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవాలి’’ అని అన్నది. తేజాస్‌ డియోస్కర్‌ దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘ఛత్రీవాలీ’ నేరుగా ఓటీటీ ‘జీ 5’లో జనవరి 20న విడుదలైంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com