రకుల్ ప్రీత్ సింగ్ కెరటం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సూపర్ హిట్ మూవీస్‌తో దూసుకెల్తోంది. ఓవైపు సందీప్ కిషన్ వంటి యంగ్ హీరోలతో నటిస్తూ.. మరోవైపు రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి ప్యాన్ ఇండియా హీరోలతో జతకడుతూ.. నాగార్జున వంటి సీనియర్లతోనూ నటిస్తోంది. మొన్నటిదాకా టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుస సినిమాలతో అక్కడ చాలా బిజీ అయింది Rakul Preet Singh. తరచూ బాలీవుడ్ ఈవెంట్లలో తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి చక్కర్లు కొడుతోంది.
ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ ఓ సెన్సేషనే. సామాజిక మాధ్యమాల్లో తనకు సంబంధించిన విషయాలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు కుర్రకారు మతి పోగొడుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తాను ఎల్లో కలర్ మినీ స్కర్ట్ విత్ బ్లేజర్ ధరించింది. బ్లేజర్ కింద రకుల్ వైట్ కలర్ మెష్ టాప్ వేసుకుంది. స్నీకర్స్.. ట్రెండీ ఇయర్ రింగ్స్ తో రకుల్ ఈ లుక్ ని మరింత అట్రాక్టింగ్ గా మార్చేసింది. ఈ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మై లెమనాయిడ్.. యూ ఆర్ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోల్లో ఆరెంజ్ కలర్ సూట్లో మెరిసిపోతోంది. యాంటీథీసిస్ బ్రాండ్ ప్యాంట్‌సూట్‌లో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది. సెలెబ్రిటీ స్టైలిష్ట్ సనమ్ రత్నాసీ రకుల్‌ని ఇంత కూల్‌గా రెడీ చేశాడు.
డెనిమ్ జీన్స్‌లో వైట్ టాప్‌లో రకుల్ లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలో రకుల్ చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. యూ ఆర్ మై డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోల కింద తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.