Rashmika : రష్మిక మందనా, రక్షిత్ శెట్టి కలిసి ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రంలో నటించారు. ఇది హీరోయిన్గా రష్మికకు మొదటి చిత్రం. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ముందుగా ఫ్రెండ్స్ అయ్యి.. తర్వాత లవర్స్ అయ్యారు. అంతే కాకుండా జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ‘కిరిక్ పార్టీ’ విడుదలయిన కొన్నిరోజులకే రక్షిత్, రష్మిక ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
ఆ తర్వాత రష్మికకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్లో బిజీ అయిపోయింది. దీంతో రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుందని, కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంది అని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. మెల్లగా అదే నిజమయ్యింది. కానీ సందర్భం వచ్చిన ప్రతీసారి రక్షిత్ మాత్రం కన్నడ మీడియా ముందు రష్మిక గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి తన గురించి చెప్పుకొచ్చాడు. రక్షిత్‌కు రష్మికతో ఇంకా టచ్‌లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురయ్యింది.
దానికి సమాధానంగా ‘‘అవును, రష్మిక, నేను ఇంకా టచ్‌లో ఉన్నాం. తనకు సినిమా ప్రపంచంలో పెద్ద కలలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ కలవైపు అడుగులేస్తోంది. అనుకున్న టార్గెట్‌ను అందుకునే సామర్థ్యం తనకు ఉంది. తన గెలుపుకు మనం తన భుజం తట్టాలి’’ అని మరోసారి రష్మికకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు రక్షిత్. వారు విడిపోయినప్పటి నుండి రష్మిక సినిమా ఏది విడుదలయినా కూడా రక్షిత్ మాత్రం తనకు ఓపెన్‌గానే ఆల్ ది బెస్ట్ చెప్తూ వచ్చాడు. అంతే కాకుండా తన పర్ఫార్మెన్స్ను ప్రశంసిస్తూ పోస్టులు కూడా చేశాడు.