Niharika : పొట్టి డ్రెస్ లో రెచ్చిపోయిన నిహారిక.. విడాకుల తర్వాత హాట్ గా మారిందిగా..

- Advertisement -

Niharika : మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. మెగా కుటుంబం నుంచి మొట్టమొదటి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లయిన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరూ ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

NIharika
Niharika

విడాకుల అనంతరం నిహారిక హీరోయిన్ గా తన కెరీర్ ను మళ్ళీ మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది. నటిగా, నిర్మాతగా ఆమె ముందు ముందు విజయాలను అందుకోవడానికి బాగానే కష్టపడుతుంది. ఇక ఈ మధ్యనే కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిన నిహారిక అక్కడే ఎంజాయ్ చేస్తుంది. వరుణ్ తేజ్, నాగబాబు ఇండియాకి తిరిగి వచ్చిన ఆమె మాత్రం ఇంకా విదేశాల్లోనే వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తున్న నిహారిక తాజాగా మరోసారి తన ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.

డిజిటల్ డైరీ అంటూ ఒక వారానికి సంబంధించిన ఫోటోలు ను షేర్ చేసింది. అందులో అందరి చూపు ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది. గోల్డ్ కలర్ మినీ టైట్ స్కర్ట్ వేసుకుని ముద్దుగుమ్మ అదరగొట్టే ఫోజులతో దర్శనమిచ్చింది. థైస్ అందాలను ఎలివేట్ చేస్తూ నిహారిక తన అందంతో కుర్రకారును మంత్రం ముగ్దులను చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినా అభిమానులు సూపర్ నిహారిక అని కొందరు అంటుండగా కొత్త ప్రాజెక్ట్ త్వరగా మొదలు పెట్టమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు..పొట్టి డ్రెస్ లో మెగా డాటర్.. యమా హాట్ గురూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here