Rajiv Kanakala : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా గత రెండు దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న యాంకర్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమ. ఈమె తొలుత హీరోయిన్ గా పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి యాంకర్ గా కెరీర్ ని మళ్ళీ ప్రారంభించింది. యాంకర్ గా మారిన తర్వాత ఆమె రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.

ఈమె రాజీవ్ కనకాల ని పెళ్లాడిన సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాజీవ్ కనకాల కి ఒక బ్రాండ్ ఇమేజి ఉంది. అలాంటి ఈ ఇద్దరికీ పుట్టిన కుమారుడు రోషన్ ఇప్పుడు ‘బబ్లీ గమ్’ అనే సినిమా ద్వారా హీరో గా వెండితెర అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే విడుదల చేసారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసారు , ఈ ఈవెంట్ కి మూవీ లో నటించిన నటీనటులు, మూవీ కి పని చేసిన సాంకేతిక నిపుణుల తో పాటుగా న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ కి సుమ నే యాంకర్ గా వ్యవహరించింది. అందరూ మాట్లాడిన తర్వాత ఏమైనా మాట్లాడుతావా రాజా అని రాజీవ్ కనకాల ని అడుగుతుంది సుమ.

అప్పుడు రాజీవ్ కనకాల మైక్ అందుకొని ‘ముందుగా ఇక్కడకి ముఖ్య అతిథి గా విచ్చేసిన నాని గారికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. నా కొడుకు హీరో గా మారడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో నువ్వు బాగానే చేసి ఉంటావని అనుకుంటున్నాను. టీజర్ బాగుంది కానీ, ఆ లాస్ట్ షాట్ (లిప్ లాక్ సన్నివేశం) ని చూసి షాక్ అయ్యాను’ అని అంటాడు రాజీవ్ కనకాల. అప్పుడు సుమ కొన్ని కొన్ని మనం ఇక్కడ మాట్లాడుకోకపోతేనే బాగుంటుంది రాజా, నాకు కూడా అలాంటివి ఉంటుంది అని తెలీదు, ఇందాకే చూసాను, ఇంకా ఇలాంటి షాకింగ్ ట్విస్టులు సినిమాలో ఎన్ని ఉన్నాయో అంటూ మాట్లాడింది.