ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే హీరో పాత్ర ఎంత అయితే ఉంటుందో , డైరెక్టర్ పాత్ర అంతకు మించి ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం హీరో కి ఎక్కువ పేరు వస్తుంది , డైరెక్టర్ కి ఆ రేంజ్ రాదు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం అందరూ డైరెక్టర్ ని తప్పుబడుతారు. ఇది మన టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా ఉండేదే. కానీ ఒక సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్టర్ ని అవమానించేలాగా మాట్లాడకూడదు. కానీ రజినీకాంత్ అదే చేసాడు.
ఆయనకీ జైలర్ కి ముందు సరైన క్లీన్ బ్లాక్ బస్టర్ ఒక్కటి కూడా లేదు, మధ్యలో రెండు మూడు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. ఇదంతా డైరెక్టర్స్ టేకింగ్ లోపమే, కానీ రీసెంట్ గా జరిగిన ‘జైలర్’ సక్సెస్ మీట్ లో ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ కంటే ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి ఇచ్చేసాడు.
అసలు విషయానికి రీసెంట్ గా చెన్నై లో ‘జైలర్’ మూవీ సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించారు. రజినీకాంత్ తో పాటుగా ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘ జైలర్ సినిమాని రీ రికార్డింగ్ పూర్తి కాకముందు చూసాను, చాలా యావరేజ్ అనిపించింది. ఇదే విషయాన్ని మూవీ యూనిట్ ని అడిగాను, వాళ్ళు బాగుంది సార్ హిట్ అన్నారు, నిజంగా చెప్పండి అని గట్టిగా అడిగితే వాళ్ళు కూడా యావరేజ్ అన్నారు. కానీ ఎప్పుడైతే రీ రికార్డింగ్ జరిగిందో, సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయింది. అనిరుథ్ ప్రతీ సన్నివేశాన్ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లేపాడు. అందుకే ఈరోజు సినిమా చూసే ప్రతీ ఒక్కరికి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రజినీకాంత్ ‘పేట’ సినిమాకి కూడా అనిరుద్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, కానీ ఆ చిత్రం ఎందుకు సక్సెస్ కాలేదు..?, డైరెక్టర్ టేకింగ్ లోపం వల్లే కదా, మీ స్థాయి వ్యక్తి ఇలా ఒక ప్రతిభ ఉన్న డైరెక్టర్ ని కించపరచడం కరెక్ట్ కాదు అంటూ రజినీకాంత్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు ఫ్యాన్స్.