Rajendra Prasad : మాస్ హీరోలు, ఫ్యామిలీ హీరోలు, రొమాంటిక్ హీరోలు ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో, ఒక కామెడీ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గం వేసుకొని , కామెడీ జానర్ సినిమాలతోనే టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కి పునాది పలికిన హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆరోజుల్లో కలెక్షన్స్ పరంగా చిరంజీవి సినిమాతో పోటీ పడేవి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు. ఒక్కటా రెండా, ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి లెజెండ్ స్థానం కి చేరుకున్నాడాయన.

అలా కామెడీ జానర్ సినిమాలతో అల్లాడించిన రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఇప్పటికీ ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకపక్క క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతూనే, మద్యమద్యలో కథానాయకుడి పాత్రలు కూడా పోషిస్తూ ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికే ఆయన లీడ్ రోల్ లో మూడు సినిమాలను ప్రకటించాడు.

అందులో ఒక సినిమా పేరు ‘షష్ఠిపూర్తి’, మరో సినిమా పేరు ‘లగ్గం’, ఇక మూడవ సినిమా పేరు ‘లవ్@65’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసే పీపుల్స్ మీడియా, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ హీరోతో సినిమా చెయ్యడం విశేషం. ఇకపోతే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కి జోడిగా అలనాటి హీరోయిన్ జయప్రద నటించబోతుంది.

వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జయప్రద ఈమధ్యనే ఒక కేసు లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆమెకి నాన్ బైలబుల్ వారెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయం లో ఆమె ఈ సినిమా ఒప్పుకోవడం పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసిన వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
