Rajamouli : టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ స్టేటస్ అందుకున్న హీరో ఉదయ్ కిరణ్. కెరీర్ తొలినాళ్లలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లోకి వెళతాడు అని అనుకున్నారు అంత. కానీ అది కొన్నాళ్ల మురిపెం గానే మిగిలిపోయింది. ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చాడో.. అంతే త్వరగా కనుమరుగైపోయాడు. ఇండస్ట్రీ నుంచే కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చాలా చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని తిరిగిరాని లోకాలకు మరళిపోయాడు. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడ పలు రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన సూసైడ్ చేసుకున్న దానికి సరైన కారణం మాత్రం ఇది అంటూ ఎవరు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మరో పుకారు తెరపైకి వచ్చింది. ఉదయ్ కిరణ్ మరణానికి పరోక్షంగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కారణమంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సై.. ఈ సినిమాలో నితిన్ కంటే ముందుగా హీరోగా ఉదయ్ కిరణ్ ని అనుకున్నారట. కానీ ఇండస్ట్రీలో ఉండే కొందరు పెద్ద మనుషులు ఆ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ ని తీసేయకపోతే తాము డబ్బుల పెట్టమని బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితిలో రాజమౌళి ఆయనని తప్పించారట. ఇలా నితిన్ ఆ ప్లేస్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ తప్పుకున్న తర్వాత ఆయన కెరియర్ దిగజారుతూ వచ్చింది. అవకాశాల్లేక డిప్రెషన్ కి లోనై ఉదయ్ కిరణ్ ఆ బాధలోనే సూసైడ్ చేసుకున్నాడని అని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి పరోక్షంగా రాజమౌళినే కారణం అంటూ చాలా మంది ఆయనపై ఆగ్రహంగా కామెంట్స్ చేస్తున్నారు.