Samantha : రూ.5వేల కోసం అలాంటి పని చేసిన సమంత.. కావాలంటే ఈ వీడియో చూడండి

- Advertisement -


Samantha : ప్రస్తుతం స్టార్ స్టేటస్ లో కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు కింది నుంచి పైకి వచ్చిన వాళ్లే. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలో.. లేదా యాడ్స్ చేసో మరేదో ఒకటి చేసి గుర్తింపు సంపాదించుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్లే. కొన్నేళ్ళుగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత కూడా అలాంటి వారిలో ఒకరు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. తన అందంతో ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా హవా చాటుతోంది. వాస్తవానికి సమంతది కేరళ రాష్ట్రం.

Samantha
Samantha

ఆమె అక్కడే పుట్టి పెరిగింది. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. తనకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. దీంతో ఆమె చదువుకున్న రోజుల్లోనే కాలేజీలో పలు కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేదట. ఇలా ఆమె సినిమాల్లోకి రాకముందే ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది. తమిళనాడుకు చెందిన ఆషిక జువెలరీకి సంబంధించి.. వస్తువులను ప్రమోట్ చేసే యాడ్ చేసింది. ఇదే యాడ్ ద్వారా ఆమె మొట్టమొదటి స్క్రీన్ పై కనిపించింది. ఈ యాడ్ చేసినందుకు సమంతా కు అప్పట్లో రూ. 5 వేలు రెమ్యునరేషన్ కింద ఇచ్చారట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంతని గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అంతలా సమంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టే స్టార్ హీరోయిన్ అయిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here