Rajamouli : ఎప్పుడు తన పనేదో తను చూసుకుంటూ.. అవసరం మేరకు మాత్రమే మాట్లాడుతూ తెలుగునాట మిస్టర్ ఫర్ఫెక్ట్‌గా పేరు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. తన సొంత సినిమా ప్రమోషన్లు, అప్పుడప్పుడు తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే రాజమౌళి హజరవుతూ తన స్టైల్‌లో మట్లాడి అక్కడికి వచ్చిన ప్రేక్షకులను ఆక్టుకుంటాడు. ఫ్యామిలీమెన్‌గా ఇప్పటికే మంచి పేరున్న రాజమౌళి తరుచూ ఏ ప్రదేశానికి వెళ్లినా కుటుంబంతోనే వెళ్తూ ఉంటాడు.

అలాంటిది తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తన భార్య రమతో కలిసి వెళ్లిన ఆయన అక్కడ ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన వాడంతా రాజమౌళి కనిపేంచేంత అమాయకుడు కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే.. పాటకు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేశారు రాజమౌళి, రమ. జక్కన్న చాలా హుషారుగా స్టెప్పులేస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రెండేళ్ల కిందట ఆర్ఆర్ఆర్‌తో పలకరించాక కొంత కాలం విశ్రాంతి తీసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనుల్లో మునిగిపోయారు.
ఈ మధ్యే స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఎప్పుడూ రాజమౌళి సినిమాలకు ఛాయాగ్రహణం అందించే సెంథిల్ కుమార్ వేరే కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. పి.ఎస్.వినోద్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇది ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని టీం ముందు నుంచి చెబుతోంది. ప్రస్తుతం మహేష్ ఈ మూవీ కోసం లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మెగా మూవీ సెట్స్ మీదికి వెళ్లొచ్చు.
Rajamouli and his wife dazzle the audience with their graceful dance moves to the enchanting rhythm, igniting the atmosphere at a family gathering 😍😍#Rajamouli #RRR #SSMB29 #Bahubali #FamilyGathering #FamilyParty pic.twitter.com/985VdreJYl
— FilmyPond (@FilmyPond) March 31, 2024