Rajamouli ప్రతీ ఇండియన్ ఇది మా సినిమా అంటూ గర్వపడిన మధుర క్షణాలు ఏమిటి అంటే అది #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చిన సమయమే అని చెప్పొచ్చు.ప్రేక్షకుల దగ్గర నుండి సెలెబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు ఇది మా సినిమా అంటూ గర్వంగా చెప్పుకొని తిరిగారు.అయితే ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ కి నామినేషన్ అయ్యేందుకు #RRR మూవీ నిర్మాత డీవీవీ దానయ్య కాస్త కృషి చెయ్యలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది.

ఆయన కాస్త చొరవ తీసుకొని ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ దృష్టికి #RRR మూవీ ని తీసుకెళ్లి ఉంటే ఇండియన్ ప్రభుత్వం ద్వారా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ రివ్యూ కి వెళ్లి ఉండేది.అలా వెళ్లి ఉంటే #RRR కి కేవలం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ తోనే సరిపెట్టకుండా, మరో నాలుగైదు క్యాటగిరీస్ లో నామినేషన్స్ దక్కుండేవని విశ్లేషకుల అభిప్రాయం.

అయితే ఎదో ఒక విధంగా నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని #RRR మూవీ కి గ్లోబల్ వైడ్ రీచ్ వచ్చింది.పెద్ద పెద్ద హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.అలా రోజు రోజుకు రీచ్ పెరుగుతూ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకొని చివరికీ ఆస్కార్ అవార్డు ని కూడా గెలుపొందింది.ఆస్కార్ అవార్డు కి నామినేషన్స్ వచ్చినప్పుడు కూడా డీవీవీ దానయ్య ప్రొమోషన్స్ కోసం ఒక్క రూపాయి కూడా తన జోబులో నుండి తియ్యలేదు.

మొత్తం రాజమౌళినే చూసుకున్నాడు.హీరోల ఖర్చులు కూడా ఆయనే భరించాడు.లేకపోతే ఇంత తేలికగా ఆస్కార్ అవార్డు దక్కుండేది కాదు.మూవీ విడుదలై భారీ లాభాలు వచ్చిన తర్వాత డీవీవీ దానయ్య కి మరియు రాజమౌళి కి మధ్య లాభాల పంపకం విషయం లో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.అప్పటి నుండి వీళ్ళ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు,సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతున్న ఈ వార్త పై రాజమౌళి స్పందిస్తాడో లేదో చూడాలి.