Rahul Sipligunj : రతికకు మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ ఆల్ ది బెస్ట్.. మళ్లీ కలిసిపోతారా ఏంటి?

- Advertisement -

Rahul Sipligunj : తెలంగాణ యాసలో మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ప్రియులకు బాగా కనెక్ట్‌ అయింది రతిక. తర్వాత ప్రశాంత్‌తో పులిహోర కలపడం.. అందరిముందు మాత్రం మొత్తం నువ్వే చేశావ్‌ అంటూ అతడిని దోషిగా నిలబెట్టడం.. తనను చులకన చేసి మాట్లాడటం.. పదేపదే తన మాజీ ప్రియుడి ప్రస్తావన తేవడం.. ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించడం.. ఇలా వరుస తప్పులు చేస్తూ పోవడంతో తన గ్రాఫ్‌ అమాంతం పాతాళంలోకి పడిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్‌ అయింది. కానీ బిగ్‌బాస్‌ టీమ్‌ ఆమెకు రీఎంట్రీ ఛాన్స్‌ ఇచ్చింది.

Rahul Sipligunj
Rahul Sipligunj

దాన్ని కూడా సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతోంది రతిక. తాజాగా రాహుల్ సిప్లింగంజ్ ఆమెతో బ్రేకప్ విషయంపై మాట్లాడారు. ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రాహుల్ సిప్లిగంజ్, రతికా ప్రేమికులు అని తెలిసిన విషయమే. ఇక వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక హౌసులో అడుగుపెట్టిన తర్వాత.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు కనెక్ట్ అయింది. ఇక అక్కడ ప్రశాంత్ తో పులిహోర కలడపం.. ఆ తర్వాత అతనికి పెద్ద షాక్ ఇచ్చి.. అందరి ముందు అతడిని దోషిగా నిలబెట్టడం.. ఇదంతా ఆమెకు మైనస్ గా మారింది. ఇక యావర్ తో లవ్ ట్రాక్ మొదలు పెట్టి.. నాలుగో వారంలో రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయింది.

Rathika Kiran Abbavaram

ఇక ఆమె హౌసులో ఉండగా రతిక తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్‌ సైతం పరోక్షంగా రతికను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే… తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్‌.. రతికతో బ్రేకప్‌ పై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో మీరు రతికా రోజ్ ప్రేమించుకుని విడిపోయారు అని వైరల్ అవుతుంది దీనిపై మీ స్పందన ఏంటి అంటూ ఓ రిపోర్టర్ అడగ్గా…. ప్రతి ఒక్కరికీ గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు అంటూ రాహుల్ చెప్పుకువచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here