Rahul Ravindran : ‘అందాలా రాక్షసి’ సినిమాతో హీరో గా ఇండస్ట్రీ కి పరిచయమైన రాహుల్ రవిచంద్రన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఆయన అనేక సినిమాల్లో హీరో గా నటించాడు కానీ, ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. దీంతో ఆయన డైరెక్టర్ గా మారి ‘చి..ల..సౌ’ అనే సినిమా తీసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా, నేషనల్ అవార్డుని కూడా సంపాదించింది.
ఈ సినిమా తర్వాత ఆయన అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘మన్మధుడు 2’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుండి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి దూరంగా ఉంటూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం లో ఒక కీలక పాత్ర చేసాడు.
ఈ చిత్రం లో రాహుల్ రాజ్ గోపాల్ అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతన్ని లీడర్ ని చెయ్యడానికి ఆయన తాత ప్రకాష్ రాజ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ చివరి వరకు ఈ రాజ్ గోపాల్ ఎవరి కొడుకు అనే విషయాన్నీ రివీల్ చెయ్యడు డైరెక్టర్ త్రివిక్రమ్. దీంతో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి ఇంతకీ రాహుల్ ఈ చిత్రం లో ఏ తండ్రి కొడుకు అని ఆలోచిస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్నని ఆయన్ని అడగగా ‘ఏమో..ఈ సినిమాలో నేను ఎవరి కొడుకు అనే విషయం నాకు కూడా తెలియదు. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో కూడా నాకు ఇదే అనుమానం కలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా రాహుల్ రవిచంద్రన్ కి మహేష్ బాబు తో కలిసి నటించడం ఇది రెండవసారి. గతం లో మహేష్ బాబు హీరో గా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం లో రాహుల్ రవిచంద్రన్ కీలక పాత్ర పోషించాడు.