టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తెలుగులో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఆల్మోస్ట్ ఇద్దరి కెరీర్ ఒక సమయంలోనే పుంజుకుంది. అదికూడా విజయ్ దేవరకొండ సినిమాతో కావడం విశేషం. పెళ్లిచూపులు సినిమాతో ప్రియదర్శి మంచి గుర్తింపు సంపాదించుకుంటే, ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో రాహుల్ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.
ప్రస్తుతం వీరిద్దరూ ఒక పక్క సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోపక్క మెయిన్ లీడ్ తో కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇక ఇటీవల ప్రియదర్శి బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ ‘ఇంటింటి రామాయణం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. దీంతో కొంతమంది నెటిజెన్లు వీరిద్దర్నీ కంపేర్ చేస్తూ కొన్ని పోస్టులు వేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఒక పోస్ట్ పై రాహుల్ రియాక్ట్ అయ్యాడు.
‘నా ఆప్తమిత్రుడు ప్రియదర్శి పులికొండ చాలా కష్టపడే వ్యక్తి. నటనకు మాత్రమే అంకితమైన వ్యక్తి. అతడిని ఈ విధంగా నాతో పోల్చడం అతనికి అవమానకరం. అతని గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే. ఈ పోలిక చాలా చీప్‌గా, చెత్తగా ఉంది. నా స్నేహితుడికి నేనెప్పుడూ దన్నుగానే ఉంటా’ అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. అయితే, రాహుల్ రామకృష్ణ వాదనను నెటిజనులు అంగీకరించడం లేదు. ప్రియదర్శితో పోలిస్తే రాహుల్ రామకృష్ణ తక్కువేమీ కాదని అంటున్నారు.
ప్రిదయర్శికి వచ్చినన్ని మంచి సినిమాలు రాహుల్ రామకృష్ణకు పడలేదంతే అని చెబుతున్నారు. తమకు ఇద్దరూ నచ్చుతారని కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ నేటివిటీని, యాసను 100 శాతం చూపించే, పలికించే నటులు వీరిద్దరూ అని కొందరు కొనియాడుతున్నారు. ఏదేమైనా ప్రియదర్శి గొప్పనటుడు అని, తనకంటే మంచి నటుడని రాహుల్ రామకృష్ణ కొనియాడడం గొప్ప విషయం. మరి దీనిపై ప్రియదర్శి ఎలా స్పందిస్తారో చూడాలి.