Honey Rose : అనుకోని షాక్.. హనీ రోజ్ సినిమా బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

- Advertisement -

Honey Rose : వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి హనీ రోజ్. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది హనీరోజ్. ఇప్పుడు ఆమె రాచెల్ (తెలుగులో రాహేలు) అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రాహేలు మూవీలో హనీరోజ్ ఫస్ట్‌లుక్‌తో అందరికీ షాకిచ్చింది. ఎవరూ ఊహించని పాత్రలో నటిస్తోంది.

Honey Rose
Honey Rose

కత్తి పట్టుకుని మాంసం కొడుతున్నట్లున్న పోస్టర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. చుట్టూ దున్నపోతుల తలకాయలతో, మాంసపు ముక్కలతో హనీరోజ్‌ బీఫ్‌ కొడుతున్నట్లు తెలుస్తుంది. వీరసింహా రెడ్డి మూవీలో గ్లామర్‌ ఒలకబోసింది హనీరోజ్‌. ఇప్పుడు రాచెల్‌ మూవీ కోసం సీరియస్‌ క్యారెక్టర్‌ చేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులో మాంసం కొడుతున్న ఫొటోను హనీరోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఆనందిని బాల డైరెక్టర్.

Honey Rose

సినిమాలో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపించబోతున్నట్టు ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అలాగే ఆమె థైస్ అందాలు అవి చూస్తుంటే ఇందులో బెడ్రూమ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయేమో అని అంతా అనుకుంటున్నారు. బీఫ్‌ అమ్మకం, వినియోగం విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫస్ట్ లుక్ కొంత వివాదాలు రేపింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సినిమాని బ్యాన్ చేయాలి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here