Rocket Raghava : బుల్లితెర మీద ఎన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఎంటర్టైన్మెంట్ షోస్ మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు మన టాలీవుడ్ కి పరిచయమై టాప్ స్టార్స్ గా ఎదిగారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర వీళ్లంతా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గెటప్ శ్రీను ఇప్పుడు వస్తున్న ప్రతీ సినిమాలోనూ కమెడియన్ గా ఉంటున్నాడు, ఆయన పాత్రలు బాగా క్లిక్ అవుతున్నాయి కూడా. ఇక సుడిగాలి సుధీర్ గురించి తెలిసిందే, హీరో గా సూపర్ హిట్ ని కూడా అందుకున్నాడు. హైపర్ ఆది, చమ్మక్ చంద్ర వంటి వారు పెద్ద స్టార్ కమెడియన్స్ గా నేడు ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. వీళ్లంతా ఈ స్థాయికి రావడానికి కారణం జబర్దస్త్. అందులో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఈ జబర్దస్త్ షో కి ఇప్పుడు రేటింగ్స్ బాగా పడిపోయాయి. సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ఇలా జబర్దస్త్ లో టాప్ కంటెస్టెంట్స్ గా పిలవబడే వీరంతా వెళ్లిపోవడంతో ఈ షోని వీక్షించే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే ఈ షో, ఇప్పుడు శుక్రవారం – శనివారం ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా జబర్దస్త్ కి సంబంధించిన కొత్త ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తున్న ఎపిసోడ్స్ లో బులెట్ భాస్కర్ మరియు రాకెట్ రాఘవ టీమ్స్ మంచి కామెడీ తో ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా, ఈసారి శుక్రవారం ఒక టీం, శనివారం ఒక టీం లాగ ఏర్పడి స్కిట్స్ చేస్తున్నారు. ఇందులో టీం లీడర్స్ మొత్తం బెట్టింగ్స్ లాగ డబ్బులు పెట్టుకొని స్కిట్స్ చేస్తున్నారు.
ఏ టీం గెలుస్తుందో ఆ టీం కి డబ్బులు వెళ్తాయి అన్నమాట. ఇందులో తరచూ రాకెట్ రాఘవ టీం, బులెట్ భాస్కర్ టీం గొడవలు పడుతూ ఉంటాయి. రీసెంట్ గా రాఘవ భాస్కర్ పై కౌంటర్ వేస్తూ ‘ఆయన స్కిట్ లోకి దూరమంటే దూరడు. అదే నాలుగు కొంపల్లో దూరమంటే దూరేస్తాడు’ అని అంటాడు. దీనికి స్పందించిన భాస్కర్ ‘ వయస్సులో నాకంటే పెద్దోడివి కదా అని గౌరవం ఇస్తుంటే రెచ్చిపోతున్నావ్..నీకెందుకయ్యా అవన్నీ..ప్రతీ వారం డబ్బులు పోయిన బాధ అనిపించదు కానీ, నీవల్ల అందరి ముందు నా పరువు మొత్తం పోతుంది’ అంటూ భాస్కర్ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.