Racha Ravi : సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలకు ముందే ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నిస్తుంటాయి. కొందరు నటీనటులు తాము సినిమాల్లో కనిపించే పాత్రల వేషధారణలతో సినిమా ఈవెంట్స్‌లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య సినిమా ఈవెంట్లలో యాంకర్ల డబుల్ మీనింగ్ డైలాగులు, పరుష పదజాలంతో కొంతమంది రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే ఓం భీమ్ బుష్ టీజర్ విడుదల కార్యక్రమంలో జరిగింది.

గతంలో బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ అందుకున్న బ్యాంగ్ బ్రదర్స్ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి.. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ లుక్, గ్లింప్స్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీ సెల్యులాయిడ్, సునీల్ బాలసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని నిన్న గ్రాండ్‌గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల స్పేస్ సూట్‌లో కనిపించారు. ఈ టీజర్ ఈవెంట్‌కు గీతా భగత్ యాంకర్‌గా వ్యవహరించారు. టీజర్ లాంచ్ సందర్భంగా జబర్దస్త్ ఎంట్రన్స్ చేసి సందడి చేసింది.

రచ్చ రవి వేదికపైకి వచ్చి యాంకర్ గీతా భగత్ తో మాట్లాడి.. ‘ఓం భీమ్ బుష్.. మీది మాయమై పోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. కాసేపు గ్యాప్ ఇచ్చి ‘నీ మనసు మాయమై నా దగ్గరకు వచ్చావు’ అన్నాడు రవి. అయితే ఈ జోక్‌కి అక్కడున్నవారంతా నవ్వుకున్నారు, అయితే యాంకర్ గీతా భగత్ మాత్రం చిర్రెత్తుకొచ్చింది. వెంటనే గీతాభగత్ ‘గ్యాప్ ఇచ్చి మాట్లాడకు.. ఓం భీమ్ బుష్ నువ్వు వెళ్లిపోయావు.. అదే నీ బుర్ర నీ నుంచి పోయింది’ అంటూ వేదికపై రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. మార్చి 22న విడుదల కానుంది.