టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇటీవలే ఈ బ్యూటీ వెకేషన్కు వెళ్లింది. హాలిడేను జాలీగా గడిపిన ఈ భామ ప్రస్తుతం మళ్లీ వర్క్ మోడ్లోకి వచ్చేసింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా రాశీ పట్టుచీరలో చాలా సంప్రదాయంగా కనిపించింది. మెడలో బంగారు ఆభరణాలతో.. మెస్మరైజ్ చేస్తున్న చిరునవ్వుతో కనువిందు చేసింది. రాశీ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

రాశీ ఖన్నా తాజాగా గ్రీన్ కలర్ పట్టుచీరలో సందడి చేసింది. ఈ చీరలో రాశీ పుత్తడి బొమ్మలా చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్నావేంటి రాశీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా అమ్మాయిలు చీరలో మామూలు అందంగా ఉండరంటూ పొగిడేస్తున్నారు. హార్ట్ ఎమోజీస్తో రాశీపై ప్రేమను కురిపించేస్తున్నారు. రాశీ యూ ఆర్ సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పట్టుచీరలో బాపూ బొమ్మలా ఉన్నావంటూ పొగుడుతున్నారు.

రాశీ ఖన్నా ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్పైనే పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ ఫర్జీ అనే వెబ్సిరీస్తో పుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు అజయ్ దేవగణ్తో కలిసి రుద్ర అనే వెబ్ సిరీస్లో సందడి చేసింది. ఈ సిరీస్లో రాశీ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం రాశీ బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ అనే చిత్రంలో నటిస్తోంది.

ఇటీవలే ఈ బ్యూటీ ధర్మ ప్రొడక్షన్స్లో ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలిసింది. రాశీ ప్రస్తుతం టాలీవుడ్లో ఏ సినిమాలు చేయడం లేదు. ఈ బ్యూటీ గతేడాది తిరు, పక్కా కమర్షియల్, సర్దార్, థాంక్యూ సినిమాలతో అలరించింది. ఇందులో తిరు, సర్దార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. థాంక్యూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పక్కా కమర్షియల్ మాత్రం నిరాశ పరించింది. ఈ సినిమాల తర్వాత రాశీ ఖన్నా మరే తెలుగు సినిమాకు సంతకం చేయలేదు.